Salaar Where Is Prabhas.. ‘సలార్’ టీజర్ వచ్చింది. అది కూడా ‘పార్ట్-వన్’ టీజర్.! దీనికి సీజ్‌ఫైర్ అనే పేరు కూడా పెట్టారు.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
హీరోయిజంని ఎలా ఎలివేట్ చేయాలో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కి (Prashant Neel) బాగా తెలుసు. ‘కేజీఎఫ్’ సినిమా రెండు భాగాలూ.. ఆ ఎలివేషన్లతోనే సూపర్ హిట్ అయ్యాయి.
Salaar Where Is Prabhas.. సలార్ సరే.. వేర్ ఈజ్ ప్రభాస్.!
సింహం.. పులి.. ఏనుగు.. డైనోసార్.. ఇలా ఓ డైలాగ్ చెబుతాడు అందులో ఓ పాత్రధారి. హీరోని డైనోసార్‌గా అభివర్ణించాడు.
ఇంతకీ, ప్రభాస్ ఎక్కడ.? ప్రభాస్ (Pan India Rebel Star Prabhas) కనిపించకపోవడమేంటి.? అతని చుట్టూనే కదా ఎలివేషన్స్ నడిచింది.!
కానీ, ప్రభాస్ కనిపించలేదు. నిజంగానే ప్రభాస్ (Rebel Star Prabhas) సరిగ్గా కనిపించలేదు. కనిపించీ, కనిపించనట్టుగా కనిపించాడంతే.
అభిమానులూ ఈ విషయమై కొంత ఆందోళన చెందుతున్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు, అభిమానులు ‘సలార్’ టీజర్‌కి పోటెత్తుతున్న వ్యూస్ చూసి మురిసిపోతూనే, ‘ఇలా చేశావేంటి ప్రశాంత్ నీల్..’ అంటూ గుస్సా అవుతున్నారు.
హీరో టినూ ఆనంద్.?
టీజర్ వరకు చూసుకుంటే, టిను ఆనంద్ హీరో అనాలా.? ఈ డౌట్ కొందరు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
టిను ఆనంద్ చాలా చాలా మంచి నటుడు. ఆయన ఇచ్చిన ఎలివేషన్.. జురాసిక్ పార్క్.. డైనోసార్.. అంటూ ప్రభాస్ క్యారెక్టర్ గురించి అభివర్ణించిన తీరు.. అది వేరే లెవల్.
Also Read: Nabha Natesh Ismartu.. అందాల దాడి ఘాటుగా ‘ఇస్మార్టు’గా.!
ప్రభాస్ కాదక్కడ.. సినిమాలో అతని పాత్రని, టిను ఆనంద్ మాటల్లో దర్శకుడు ఎలివేట్ చేసిన వైనం.. డైరెక్ట్ ప్రభాస్ కటౌట్ చూపించినా వచ్చి వుండేది కాదేమో.!
ఏదిఏమైతేనేం, ‘సలార్’ టీజర్ మాత్రం వ్యూస్ కొల్లగొట్టడంలో తగ్గేదే లే.. అంటోంది.! ఈసారి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు.. అంతకు మించి.. అనేలానే ‘సలార్’ కనిపిస్తోంది.