ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘గాడ్ ఫాదర్’ (Salman Khan Godfather) సినిమాలో నటించారు. సల్మాన్ ఖాన్‌ని ఒప్పించింది చిరంజీవి తనయుడు రామ్ చరణ్.
గతంలో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాకి తెలుగులో రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.
సల్మాన్ ఖాన్ – చిరంజీవి (Megatar Chiranjeevi) మధ్య ఎప్పటినుంచో స్నేహం వుంది. రామ్ చరణ్ (Ramcharan) – సల్మాన్ ఖాన్ మధ్య అనుబంధం ఏర్పడేలా చేసింది ఆ స్నేహం.
Salman Khan Godfather బహుమతి ఐదు కోట్లు.!
సల్మాన్ ఖాన్ ఓ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడన్న విషయమై భిన్న వాదనలే వున్నాయి. గెస్ట్ అప్పీయరెన్స్ అయినా.. బోల్డంత రెమ్యునరేషన్ అందుకుంటాడు సల్మాన్ ఖాన్.
అయితే, ఆ రెమ్యునరేషన్ విషయంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) కొన్ని ‘రూల్స్’ పెట్టుకున్నాడు. స్నేహ సంబంధాలు కొనసాగించే క్రమంలో అసలు రెమ్యునరేషన్ తీసుకోని సందర్భాలు కోకొల్లలు.

‘ఔను, సల్మాన్ ఖాన్‌కి (Salman Khan) రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన పనిలేదు.. ఆయనకి మనం నచ్చితే, మనకోసం ఏమైనా చేస్తాడు..’ అని చాలామంది చెబుతుంటారు ఈ బాలీవుడ్ నటుడి గురించి.
రెమ్యనరేషన్ ఇవ్వాలని చూస్తే.. తిట్టి పంపించినవైనం..
చిరంజీవి సినిమాలో నటించడం ఓ గౌరవంగా భావిస్తాననీ, అలాంటి తనకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ప్రయత్నించారనీ, వారిని తాను తిట్టి పంపించినానని ‘గాడ్ ఫాదర్’ విషయంలో సల్మాన్ ఖాన్ స్వయంగా చెప్పాడు.
అలాంటి సల్మాన్ ఖాన్, ‘గాడ్ ఫాదర్’ (Godfather) టీమ్ నుంచి బహుమతి అందుకుంటాడా.? అది కూడా, ఐదు కోట్ల విలువైన బహుమతి అట.!
Also Read: పవన్ కళ్యాణ్ ‘గాడ్ ఫాదర్’ చిరంజీవి.! స్వీట్ వార్నింగ్.!
‘ఎడ్డి’తనం అంటే ఇదే మరి.! ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాకి రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) రెమ్యునరేషన్ తీసుకోలేదు, బహుమతి కూడా తీసుకోలేదు. సల్మాన్ ఖాన్ ఇప్పుడు చేసిందీ అదే.
పాఠకులకు మనవి..
కుల జాడ్యంతో తాము కుచించుకుపోతూ, సమాజానికి ఆ ‘కుల వైరస్’ని అంటించి పైశాచికానందం పొందేటోళ్ళ ‘ఎడ్డి’తనాన్ని ఎండగట్టడం తప్ప.. ఇక్కడ ఈ ‘ఎడ్డితనం’ ఫీచర్ ద్వారా ఎవర్నీ కించపర్చే ఉద్దేశ్యం లేదని అర్థం చేసుకోగలరు.!
– yeSBee