Samantha Bootha Vivaham.. సినీ నటి సమంత పెళ్ళి చేసుకుంది. అదీ, హిందూ సంప్రదాయ పద్ధతిలో.! స్నేహితుడు, సినీ ప్రముఖుడు రాజ్ నిడిమోరుని పెళ్ళాడింది సమంత.
ఇందులో వింతేముంది.? అయినా, సమంతకి ఇది మొదటి సారి కాదు కదా.! గతంలో అక్కినేని నాగచైతన్యని పెళ్ళాడింది.. అతనితో విడాకుల తర్వాాత, రాజ్ నిడిమోరుని పెళ్ళి చేసుకుంది.?
వింత లేకపోవడమేంటి.? ఈసారి సమంత ప్రత్యేక పద్ధతిలో వివాహం చేసుకుంది తెల్సా.? ఇషా ఫౌండేషన్ ఈ ప్రత్యేకమైన పెళ్ళి తంతుని నిర్వహించింది.
ఓహ్.. పెళ్ళిళ్లలో రకాలు కూడా వున్నాయా.? లేకనేం, ప్రధానంగా హిందూ వివాహానికి సంబంధించి మొత్తం 8 రకాలు వున్నాయని పండితులు చెబుతారు.
ఆ ఎనిమిది రకాల వివాహాల గురించి ఇంకోసారి ప్రస్తావించుకుందాం. ప్రస్తుతానికైతే, సమంత చేసుకున్న ప్రత్యేకమైన వివాహ పద్ధతి మీదనే మాట్లాడుకుందాం.
Samantha Bootha Vivaham.. భూత వివాహం చేసుకున్న సమంత, రాజ్ నిడిమోరు.!
భూత వివాహం అంటే.. రాక్షస వివాహం అనుకునేరు.! కాదు. ఇదో రకమైన యోగా లింక్డ్ వివాహమట.! కొత్తగా వింటున్నాం.! ఇషా ఫౌండేషన్ సహా, కొన్ని సంస్థలు మాత్రమే, ఈ తరహా వివాహాల్ని జరిపిస్తుంటాయట.
లింగ భైరవి ఆలయాల్లో ఈ తరహా వివాహాల్ని జరుపుతుంటారట. ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచేలా జరిగే వివాహంగా భూత వైద్యం గురించి పేర్కొంటున్నారు.
వధూవరుల దేహాల్లోని పంచ భూతాలను శుద్ధి చేయడం ఈ భూత వివాహంలోని ప్రత్యేకతగా చెబుతున్నారు.
సమంత మాత్రమే ఇలా కొత్త పద్ధతిలో భూత వివాహం చేసుకుందా.? అంటే, గతంలో కూడా ఒకరిద్దరు ప్రముఖులు ఈ తరహా వివాహాల్ని చేసుకున్నారట.
అత్యంత సన్నిహితులు మాత్రమే, ఈ వివాహ వేడుకకు ప్రత్యక్ష సాక్షులు.
చక్కనమ్మ ఏం చేసినా..
కవులు చెబుతుంటారు, చక్కనమ్మ ఏం చేసినా అందమే.. అని.! సమంత రెండో వివాహం విషయంలోనూ అదే జరుగుతోంది.!
ఇప్పటిదాకా ఎక్కడా ఈ ‘భూత వివాహం’ గురించిన చర్చ ఇంతలా జరిగింది లేదు. ‘భూత వైద్యం’ గురించి విన్నాం గానీ, ఈ బూత ప్రేత వివాహాలేంటి.? అని కొందరు పెదవి విరుస్తున్నారు.
ఎవరి గోల ఎలా వున్నా, పెళ్ళి ఏ పద్ధతిలో చేసుకోవాలన్నది సమంత, రాజ్.. సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం.. వివాహమూ జరిగిపోయింది.
ఇద్దరూ కలకాలం ఈ వివాహ బంధాన్ని కొనసాగిస్తారా.? లేదా.? అన్నదీ ఆ ఇద్దరికీ సంబంధించిన విషయమే. సెలబ్రిటీలు కదా, జనం అన్ని విషయాలూ మాట్లాడుకుంటారు.. దాన్ని ఆపలేం.!
ఇక, భూత వివాహం గురించి పూర్తి వివరాలు ఇంకో సందర్భంలో ప్రస్తావించుకుందాం. అలానే, హిందూ వివాహ పద్ధతులు మొత్తంగా ఎన్ని.? అనే విషయం గురించీ మరో సందర్భంలో మాట్లాడుకుందాం.
