Samantha Ruth Prabhu Coffee.. కాఫీ విత్ కరణ్.. ఇదొక టాక్ షో. కొత్త సీజన్ షురూ అయ్యింది. త్వరలో టెలికాస్ట్ కాబోతోంది.
అలియా భట్, సమంత (Samantha Ruth Prabhu), అక్షయ్ కుమార్.. ఇలా ప్రముఖ నటీనటులు, ఈ టాక్ షోలో.. తమ మనసులో మాటల్ని బయటపెట్టేయనున్నారు.
ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ఈ టాక్ షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మహా ముదురు కరణ్ జోహార్. ఏయే టాపిక్స్ ప్రస్తావిస్తే, ఆ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుందో ఆయనకు బాగా తెలుసు.
తారల వ్యక్తిగత జీవితాల్లోకి ఆయన తొంగి చూడటం కొత్తేమీ కాదు. ఆయా తారల వ్యక్తిగత జీవితాల్లోని కీలక అంశాల్ని బయటపెట్టడంలో ఆయన రూటే సెపరేటు.!
సరే, తారలు కూడా అలాంటి షో ద్వారా తమ వ్యక్తిగత జీవితంలో వివాదాస్పద అంశాలు, ఫన్నీ ఎలిమెంట్స్‌ని ప్రపంచానికి చెప్పేందుకు ఉత్సాహం చూపుతుంటారనుకోండి.. అది వేరే సంగతి.
Samantha Ruth Prabhu Coffee.. కరణ్ కాఫీ.. సమంత ఏం చెప్పిందట.?
ఇంతకీ, సమంత ఏం చెప్పింది కరణ్ జోహార్ టాక్ షో ద్వారా.? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. వైవాహిక జీవితాలు దెబ్బతినడానికి కారణం కరణ్ జోహార్.. అంటూ ఆయన సమక్షంలోనే చెప్పేసింది సమంత.

ఔనా.? అదెలా.. అంటే, ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ తరహాలో జీవితం వుంటుందని అంతా ఊహించుకుంటారనీ, కానీ అది ‘కేజీఎఫ్’లా మారుతుందనీ సమంత కరణ్ జోహార్ యెదుటే చెప్పడం గమనార్హం.
ఏదో సరదాగా ఈ మాట చెప్పిందా.? లేదంటే, అక్కినేని నాగచైతన్యతో విడాకుల గురించి కాస్త లోతుగా మాట్లాడిందా.? అన్ని విషయాలపైనా సమంత ఓపెన్ అయిపోయిందా లేదా.? అయిపోయే వుంటుంది.!
మామూలుగా వుండదు మరి.!
ఎందుకంటే, సమంత మీద.. విడాకుల తర్వాత విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. సో, సమంత తన మీద పడుతున్న అభాండాలపై స్పష్టత ఇచ్చేందుకు దీన్నొక అద్భుతమైన వేదికగా భావించి వుండొచ్చు.
Also Read: జబర్దస్త్ అనసూయ.! ఎప్పుడో పడిపోవాల్సిన వికెట్టు.!
ఒకవేళ సమంత (Samantha Ruth Prabhu) అంతలా ఓపెన్ అయిపోతే మాత్రం, ఆ తర్వాత పరిస్థితులు మరింత భిన్నంగా వుండే అవకాశాల్లేకపోలేదు.!
సమంత – నాగచైతన్య విడాకుల తర్వాత, ఎక్కడా నాగచైతన్య ఓపెన్ అవలేదు.. చివరికి సోషల్ మీడియా ద్వారాక కూడా. కానీ, సమంత మాత్రం పరోక్షంగా బోల్డన్ని కామెంట్లు చేస్తోంది.. అభిమానుల్ని కెలుకుతోంది కూడా.!