Operation Sindoor Turkiye Ban.. టర్కీ.. అదేనండీ, ఇప్పుడు తుర్కియే అంటున్నాం కదా.! పాకిస్తాన్‌కి కీలక సమయంలో ఆపన్న హస్తం అందించింది టర్కీ అలియాస్ తుర్కియే.
పాకిస్తాన్‌పై భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన క్రమంలో, తుర్కియే నుంచి సాయం అందుకుంది పాకిస్తాన్. ఇదో ట్విస్టు నిజంగానే.!
ఆపరేషన్ సిందూర్ దెబ్బకి, తుర్కియే ఆయుధాలూ తుస్సుమన్నాయ్. తుర్కియే సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొస్తున్నాయి.
Operation Sindoor Turkiye Ban.. పాకిస్తాన్ మీద అంత ప్రేమెందుకో.?
ఎప్పుడైతే, పాకిస్తాన్‌కి తుర్కియే నుంచి సైనిక సాయం, ఆయుధాల సాయం అందిందనే విషయం బయటపడిందో, వెంటనే ‘బ్యాన్ తుర్కియే’ అంశం తెరపైకొచ్చింది.
తుర్కియే యాపిల్స్‌ని బ్యాన్ చేస్తూ, దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాపారులు తెగేసి చెప్పారు. మరోపక్క, తుర్కియేకి చెందిన సంస్థలపై ‘బ్యాన్ విధించే’ కార్యక్రమం అధికారికంగా షురూ అయ్యింది.
దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సేవలందిస్తున్న తుర్కియేకి చెందిన సంస్థపై భారత ప్రభుత్వం వేటు వేసింది. ఇది తుర్కియే ఊహించని విషయమే.
‘భారత్ విధిస్తున్న ఈ బ్యాన్ వల్ల తుర్కియే కొంత నష్టపోవచ్చు.. కానీ, స్నేహానికే మేం ఎక్కువ విలువ ఇస్తాం.. పాకిస్తాన్‌తో మా స్నేహ బంధం గొప్పది’ అని తుర్కియే చెప్పుకుంటోంది.
Also Read: Maranamass Telugu Review: హాస్యంతో కూడిన బీభత్సం.!
చిత్రమేంటంటే, పాకిస్తాన్ – తుర్కియే కలవడం వల్ల భారత దేశానికి ఎలాంటి నష్టమూ లేదు. ఇప్పుడిక నష్టపోతున్నది తుర్కియేనే.!
ఇకపై, సినిమా షూటింగుల నిమిత్తం తుర్కియేకి వెళ్ళే ప్రసక్తే లేదని పలువురు సినీ ప్రముఖులు స్పష్టం చేస్తున్నారు. భారత పర్యాటకులు సైతం, తుర్కియే టూర్లను రద్దు చేసుకుంటున్నారు.
గతంలో తుర్కియేలో తీవ్ర భూకంపం సంభవించినప్పుడు, భారతదేశమే తొలుత ‘సాయం’ అందించింది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన చందాన, తుర్కియే.. తన నీఛపు బుద్ధిని బయటపెట్టుకుంది.
కాగా, డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం తుర్కియేని ఎంచుకున్న పలువురు ప్రముఖులు, తమ ఆలోచనల్ని మార్చుకుంటున్నారు.
ఒక్కమాటలోో చెప్పాలంటే, పాకిస్తాన్ కంటే ఎక్కువగా తుర్కియేని ద్వేషిస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. శతృవుకి సాయం చేసినవాడిని, శతృవు కంటే హీనంగా చూడాలి మరి.!