Samantha Ruth Prabhu.. అరరె.! సమంత అందం తగ్గిపోయిందట.! ఇప్పుడెలా.? మునుపటిలా ఆమె ప్రకాశవంతంగా కనిపించడంలేదుట.! అయ్యోపాపం.!
గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాదపడుతోంది. ఈ కారణంగానే కఠినతరమైన వైద్య చికిత్స పొందాల్సి వస్తోంది.
మయోసైటిస్ వస్తే, ఆ చికిత్స ఎంత భయంకరంగా వుంటుందో చెప్పనలవి కాదంటూ.. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
Samantha Ruth Prabhu.. తగ్గేదే లే.. అంటున్న సమంత
అనారోగ్య సమస్యతో బాధపడుతూనే, మయోసైటిస్‌కి చికిత్స పొందుతూనే, ‘యశోద’ సినిమాకి డబ్బింగ్ చెప్పింది సమంత. అదీ సమంత అంటే.!

కానీ, సోషల్ మీడియాలో కొందరు, సమంత ‘గ్లో’ గురించి కామెంట్ చేస్తున్నారు. దాంతో, సమంతకి ఒళ్ళు మండింది. ‘నాలా నీకు అలాంటి సమస్య రాకూడదని కోరుకుంటున్నా..’ అంటూ సమంత స్పందించింది.
నిజమే, అనారోగ్య సమస్య అంటే.. అది ఎవరికీ రాకూడదనే కోరుకోవాలి. ‘అయ్యోపాపం’ అని జాలి చూపించనక్కర్లేదు, వాళ్ళ మీద జుగుప్సాకరమైన విమర్శలు చేయకపోతే చాలు.
షీ ఈజ్ బ్యాక్.!
‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చింది సమంత. ఈ క్రమంలో ఆమె కొంత ఇబ్బంది పడింది. ఎమోషనల్ అయ్యింది కూడా.
Also Read: Keerthy Suresh: జలకాలాటలలో.!
అయినాగానీ, అంత కష్టమైన పరిస్థితుల్లోనూ ఆమె మీడియా ముందుకు రావాలంటే అభినందించి తీరాల్సిందే. ఇక గ్లో.. అంటారా.? వ్యక్తిత్వం.. పోరాడే తత్వం.. ఇంతకన్నా ‘మెరుపులు’ ఇంకేముంటాయ్.?