Samantha Ruth Prabhu Kick.. ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్ సమంత.. ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఆమె రేంజ్ వేరే.. ఈ విషయంలో.!
మామూలుగా కాదు.. ఫిట్‌గా వుండటమంటే, చాలా చాలా బరువుల్ని అవలీలగా ఎత్తి పడేయడం వరకూ.. సమంత అంటేనే, వేరే లెవల్ అంతే.
లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ కోసం సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేసేస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కోసం సమంత చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Samantha Ruth Prabhu Kick.. మయోసైటిస్ దెబ్బ కొట్టింది..
ప్చ్.. సమంత కెరీర్ రాకెట్‌లా దూసుకుపోతుందనుకుంటే, మయోసైటిస్ దెబ్బకి డీలా పడింది.! ఆరోగ్యం క్షీణించింది.. వైద్య చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.. అదీ కఠినమైన పరిస్థితుల్లో.

నిజానికి, ఆ పరిస్థితి నుంచి బయటపడలేనేమో.. అన్నంత భయం వేసిందట సమంతకి. ఎలాగైతేనేం, మయోసైటిస్ నుంచి క్రమంగా కోలుకుంటోంది సమంత.
ప్రస్తుతానికైతే పూర్తిగా కోలుకున్నట్టే. ఇంకేముంది.? మళ్ళీ యధాతథంగా సమంత (Samantha Ruth Prabhu) ఫిట్‌నెస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది.
లేడీ డైనమైట్..
చూస్తున్నారు కదా.. లేడీ డైనమైట్.. అన్నట్లుంది కదా, ఈ స్టిల్ చూస్తోంటే.! ఓ కాలుని నేల మీద వుంచి, ఇంకో కాలిని గాల్లోకి సమంత లేపిన వైనం.. ఆ కిక్ షాట్.. కెవ్వు కేక.!

నిజానికి, సమంత (Samantha Ruth Prabhu) ఎప్పుడూ బరువు పెరిగింది లేదు. కాకపోతే, కండలు తిరిగిన శరీరాన్ని సంతరించుకుంటోంది.
ఇదంతా తన తదుపరి ప్రాజెక్టుల కోసమేనా.? వెబ్ సిరీస్, సినిమాలు.. ఇలా సమంత మళ్ళీ యాక్టింగ్ కెరీర్‌లో బిజీ అవబోతోంది.! ఆల్ ది బెస్ట్ సమంత.!