Samantha Ruth Prabhu.. సినిమా అనగానే, ముందుగా మనోభావాలు గుర్తుకొచ్చేస్తున్నాయ్. వాల్మీకి అనే అద్భుతమైన పేరుని ఓ సినిమా టైటిల్‌గా పెట్టడాన్నికొంతమంది తప్పు పట్టారు. తప్పని సరి పరిస్థితుల్లో టైటిల్ మార్చుకోవల్సి వచ్చింది. పేరులో ఏముంది.. టైటిల్ వివాదంతో సంబంధం లేకుండా ‘గద్దలకొండ గణేష్’ హిట్టయ్యింది.
చాన్నాళ్ల క్రితం ‘రచ్చ’ సినిమాలో ఓ పాటలో బుద్ధుడి బొమ్మ వాడటం వివాదాస్పదమైంది. దాంతో బొమ్మకి ముసుగేశారు. పాట ఫలితంలోనూ, సినిమా ఫలితంలోనూ మార్పులేమీ రాలేదు. ఇంకాస్త వెనక్కి వెళితే, ‘జయం’ సినిమాలో రైలు బండి పాట లిరిక్స్ మార్చుకుంది.
Samantha Ruth Prabhu స్పెషల్ సాంగ్ రచ్చ..
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘జానీ’ సినిమాలో ఓ పాటకి కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే, సున్నితమైన సినిమా మీద మనోభావాల దెబ్బలు చాలానే కనిపిస్తాయ్. వీటిల్లో చాలా వరకూ పబ్లిసిటీ స్టంట్లే. తమ పబ్లిసిటీ కోసం సినిమాల జీవితాలతో ఆడుకోవాలనుకుంటారు కొందరు.

తాజా ‘జాతిపుష్పం’ ఏంటంటే.. ‘ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా..’ పాట చుట్టూ వచ్చిన వివాదం మగజాతి ఆణిముత్యాల మనో భావాలు దెబ్బ తిన్నాయట. వెంటనే పాటని ఆపేసి, మొత్తం మగజాతికి క్షమాపణ చెప్పాలంటూ చిత్ర బృందంపై కోర్టుకెక్కింది పురుష సంఘం.
మనోభావాలు మహిళలకు మాత్రమేనా.?
వామ్మో.! ఇదెక్కడి వింత.. ఇలాంటి పాటలు తెలుగు సినిమాల్లో కోకొల్లలుగా వచ్చాయ్. అప్పుడీ పురుష సంఘాలు ఎక్కడికి పోయాయ్.? ఒక రకంగా చూస్తే, సదరు పురుష సంఘం అభ్యంతరం పరిగణనలోకి తీసుకోవల్సిందే. ఏం.. మనోభావాలు మహిళలకే ఉంటాయా.? మగాళ్లకు ఉండవా.?
మహిళలపై అసభ్యకరమైన రీతిలో సినిమాలు తీసినప్పుడు, పాటలు రాసినప్పుడు, పోస్టర్లు రూపొందించినప్పుడు వివాదాలు వస్తే, మార్పులు జరిగాయ్ కదా. ఇప్పుడూ జరగాల్సిందే. కానీ, చిన్న విషయానికి మనోభావాలు దెబ్బ తినేస్తే, కళాత్మకత ఏమైపోవాలి.? చేసుకున్నోడికి చేసుకున్నంత. ‘అతి సర్వత్రా వర్జయేత్..’ అనేది ఇందుకే మరి.
Also Read: Naga Chaitanya జ్ణాపకాల్ని Samantha చెరిపేసుకుంటోందా?
అన్నట్లు ఈ వివాదం ఈ పాటకి ఇంకాస్త ఎక్కువ పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది. ఇదో టైపు పబ్లిసిటీ స్టంటు మరి. అన్నట్టు, సమంత (Samantha Ruth Prabhu) వ్యక్తిగత జీవితంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే పనిగట్టుకుని కొందరు ఈ తరహా దుష్ప్రచారానికి తెరలేపారా.? అన్న చర్చ కూడా నడుస్తోందండోయ్.
సమంతనే కాదు, ఈ విషయంలో రష్మికపైనా సోషల్ మీడియాలో ఈ పాటకు సంబంధించి ట్రోలింగ్ జరుగుతుండడం ఇంకాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది అందర్నీ.