Table of Contents
Samantha Ruth Prabhu Raj.. ఆమె సినీ నటి. అతనో ఫిలిం మేకర్.! ఇద్దరి మధ్యా ప్రొఫెషనల్‌గా స్నేహం వుంది.
ఏమో, ఆ ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయేమో. అది ఆ ఇద్దరి వ్యక్తిగత వ్యవహారం.
ఇద్దరూ కలిసి ఓ కారులో ప్రయాణించడమే పెద్ద నేరమన్నట్లుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కథనాల్ని వండి వడ్డిస్తే, అసలు ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.
సినీ నటి సమంత గురించే ఇదంతా. బాలీవుడ్ ఫిలిం మేకర్ రాజ్‌తో సమంత ప్రేమాయణం నడుపుతోందన్న గాసిప్స్ గత కొన్నాళ్ళుగా వినిపిస్తున్నాయి.
సమంత గతం.. అందరికీ తెలిసిందే..
అక్కినేని నాగచైతన్యతో గతంలో సమంతకి వివాహం జరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత, ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలొచ్చాయి, ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
సమంతతో విడాకుల అనంతరం, అక్కినేని నాగచైతన్య మరో సినీ నటి శోభిత ధూళిపాళ్ళను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత మాత్రం, ఇప్పటిదాకా పెళ్ళి చేసుకోలేదు.
ఏమో, రాజ్ – సమంత మధ్య స్నేహం, ప్రేమగా మారి, అది పెళ్ళి పీటల వరకూ వెళుతుందేమో.. అదైతే, ఇప్పుడే చెప్పలేం.
ఇంకోపక్క, రాజ్ వివాహితుడు, కానీ.. ఆయన తన భార్యకు దూరంగా వుంటున్నాడన్న ప్రచారమైతే లేకపోలేదు.
Samantha Ruth Prabhu Raj.. గాసిప్పులు సమంతకి కొత్తేమీ కాదు..
నాగచైతన్యతో ప్రేమ, పెళ్ళికి ముందూ సమంత మీద ‘ప్రేమ, పెళ్ళి’ అంటూ, పలువురు హీరోలతో లింకులు పెడుతూ చాలా గాసిప్స్ వచ్చాయి. కానీ, ఆ గాసిప్స్ ఏవీ నిజం కాలేదు.
Also Read: బెట్టింగు.. ఆ ‘ప్రముఖులకు’ పడుతుందా ఫిట్టింగు.!
గాసిప్స్ సమంతకి కొత్త కాదు. కొన్నాళ్ళ క్రితం సమంత తీవ్ర అనారోగ్యానికి గురైంది. అరుదైన వ్యాధితో సమంత బాధపడటం, ఈ క్రమంలో ఆమె సినిమాలకు దూరమవడమూ తెలిసిన విషయాలే.
సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొత్త జీవితం, అదీ వైవాహిక జీవితం మళ్ళీ ప్రారంభించాలనుకుంటే, అది సమంత వ్యక్తిగత వ్యవహారం.
ఇది తప్పయితే, అదీ తప్పే.!
నాగచైతన్య రెండో పెళ్ళి చేసుకున్నప్పుడు, సమంత రెండో పెళ్ళి చేసుకోవడం తప్పెలా అవుతుంది.? ఈ విషయంలో నాగచైతన్య అభిమానులు, సమంతని ట్రోల్ చేయడం ఒకింత విడ్డూరమే.
ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సమంత చుట్టూ వస్తున్న ‘మళ్ళీ పెళ్ళి పుకార్ల’ సంగతి అంటారా.?
తెలుగు మీడియా ఎప్పుడో అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.