Samantha Ruth Prabhu.. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది సినీ నటి సమంత. ఈ విషయాన్ని ఇటీవలే సమంత స్వయంగా వెల్లడించింది.
వైద్య చికిత్స పొందుతూనే తన తాజా చిత్రం ‘యశోద’కి డబ్బింగ్ చెప్పింది, సినిమా ప్రమోషన్ కోసం ఓ వీడియో ఇంటర్వ్యూ కూడా సమంత చేయడం గమనార్హం.
సినిమా గురించి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత, ఆ సినిమాలోని యశోద పాత్రకీ, తన జీవితానికీ కొన్ని పోలికలున్నాయని చెప్పడం గమనార్హం.
Samantha Ruth Prabhu నేనూ కష్టాలు పడ్డాను.. పడుతూనే వున్నాను..
సాధారణ మద్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాననీ, ఇంకా వాటితో సావాసం చేస్తూనే వున్నానని సమంత చెప్పుకొచ్చింది.
‘చాలా కష్టమైన ఫేజ్ దాటేశారని అనిపించింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమోనని భయపడ్డారు. కానీ, ఇప్పుడు బాగానే వున్నాను..’ అని చెబుతూ కంటతడి పెట్టింది సమంత.
నేను చచ్చిపోలేదు.. ఇప్పుడే చచ్చిపోను..
‘ఇప్పటికైతే బతికే వున్నాను. ఇప్పట్లో చచ్చిపోను. ఆ విషయం మీద నాకు స్పష్టత వుంది.. ప్రాణాంతకమైన సమస్య అయితే లేదు..’ అంటూ సమంత తన అనారోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చింది.
Also Read: ఔను.! వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు.!
ప్రాణాంతక వ్యాధితో సమంత బాధపడుతోందనీ, ఆమె బతకడం కష్టమేననీ ఊహాగానాలు రావడంపై సమంత పై విధంగా స్పందించింది. ఈ క్రమంలో ఆమె కొంత ఎమోషనల్ అయ్యింది కూడా.!
సమంత అలా కంటతడి పెట్టడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.