సినీ నటి సమంత (Samantha Ruth Prabhu) ‘యశోద’ సినిమా సమయంలో బాంబు పేల్చింది.! ఔను, తనకు ఓ అనారోగ్య సమస్య వుందని బయటపెట్టింది. దాని తీవ్రత గురించీ పేర్కొంది.!
చిన్న విషయం కాదది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు వెల్లడించింది. అంతే, ఆమె అభిమానులు అసలు ‘మయోసైటిస్’ అంటే ఏంటి.? అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
‘యశోద’ సినిమా వచ్చి వెళ్ళింది.! ‘శాకుంతలం’ సినిమా రాబోతోంది.! ఇంతకీ, సమంత ఎలా వుంది.? అంటే, పబ్లిక్ అప్పీయరెన్స్ ఇప్పటివరకూ ఇవ్వలేదు సమంత.
Samantha Ruth Prabhu జీవితం మునుపటిలా లేదు.!
జీవితం మునుపటిలా లేదంటూ సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజణ్ సంధించిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. దాంతో, అంతా అవాక్కయ్యారు.

మునుపటిలా లేదంటే దానర్థమేంటి.? అని సమంత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సమంత అంటేనే డైనమిక్ పర్సనాలిటీ.!
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కోసం సమంత చేసిన పోరాట సన్నివేశాల్ని ఎలా మర్చిపోగలం.? మళ్ళీ అలా తెరపై సమంత మెరుపులా కదలగలదా.? లేదా.? అన్న డౌట్ చాలామందికి వస్తోంది.
‘శాకుంతలం’ సంగతి సరే.. ‘ఖుషి’ మాటేమిటి.?
‘శాకుంతలం’ సినిమా పూర్తయిపోయింది. కానీ, ‘ఖుషి’ సినిమా పరిస్థితేంటి.? విజయ్ దేవరకొండ సరసన ఈ ‘ఖుషి’ సినిమాలో సమంత నటిస్తోంది.
Also Read: Rashmika Mandanna బాలీవుడ్ పైత్యమిది.!
సమంత అనారోగ్యం వల్లనే ‘ఖుషి’ సినిమా షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. సమంత ఎప్పుడు తిరిగొస్తుందో.. ఎలా తిరిగొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు అభిమానులు.