Samantha Ruth Prabhu Uluwatu.. ఫొటోలో వున్నదెవరబ్బా.? గోడ మీద ఏదో రాసి వున్నట్లు కనిపిస్తోంది.! ఏంటది.?
అసలు ‘Uluwatu’ అంటే ఏంటి.? ‘Ulu’ అంటే, భూమి చివర.! ‘Watu’ అంటే, రాయి అట.! అర్థమయ్యింది కదా.! భూమి చివరన వున్న రాయి అని అర్థం.. ‘Uluwau’ అంటే.!
ఇంతకీ, దీన్ని చదువుతున్నదెవరు.? ఆ సంగతి తర్వాత చూద్దాం.!
సమస్యల సుడి గుండంలో కొట్టు మిట్టాడే మనం.. వాటిని కాస్త పక్కన పెట్టి, ఒంటరిగా.. సత్యాన్వేషణ చేయగలిగితే.. ఆ కిక్కే వేరప్పా.!
పైన పేర్కొన్న Uluwatu’ అర్థం, పరమార్థం ఇదే.!
విహార యాత్రలో సమంత.!
ఫొటోలో వున్నది నటి సమంత.! ఇటీవల ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ సినిమా షూటింగ్ పూర్తి చేసింది సమంత.
తాజాగా ‘ఖుషీ’ సినిమా పనుల్ని కూడా సమంత పూర్తి చేసేసుకుంది. ప్రస్తుతం విహార యాత్రలో నిమగ్నమైపోయిన సమంత.. ఇదిగో ఈ తరహా ఫొటోలతో సందడి చేస్తోంది.

మయోసైటిస్ అనే అనారోగ్య సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది సమంత (Samantha Ruth Prabhu). కోలుకున్నట్టే కోలుకుని, మళ్ళీ అనారోగ్యం బారిన పడుతోంది.
Also Read: టైటానిక్ విషాదం! ఐదుగుర్ని మింగేసిన ఓసియన్ గేట్ ‘టైటాన్’!
మానసికంగా దృఢంగా వుండడం ద్వారా మయోసైటిస్ నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు.
ఆ సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియా వేదికగా.. ఇదిగో ఇలాంటి కోట్స్ కావొచ్చు.. మంచి మంచి విషయాల్ని కావొచ్చు.. సమంత, తన అభిమానులకు తెలియజేస్తుంటుంది.