Samantha Shaakuntalam అయ్యయ్యో.. సమంతకే ఎందుకిలా జరుగుతోంది.? సమంత అభిమానుల ఆవేదన ఇది.! అనారోగ్యంతో బాధపడుతున్నా, ఫైటర్‌లా తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే వుంటోంది సమంత.!
ఔను, అభిమానులు ఆమె గురించి ఇలాగే అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎంతైనా ట్రోలింగ్ జరగనీ.. సమంత మాత్రం, తగ్గేదే లే.. అంటోంది. ఆమె అభిమానులు కూడా అంతే.
సమంత ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అది కాకుండా తెలుగులో ‘శాకుంతలం’ సినిమా విడుదల కావాల్సి వుంది. ‘ఖుషీ’ సినిమా సగంలో ఆగిపోయింది.
Samantha Shaakuntalam ప్చ్.. వెనక్కి నెట్టేశారు..
సమంత – గుణశేఖర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమా ఈ ఫిబ్రవరిలో విడుదల కావాల్సి వుంది. నిజానికి, ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇది.
ఫిబ్రవరిలో డేట్ కూడా వచ్చేసింది.. కానీ, ఇంతలోనే సినిమాని వాయిదా వేసేశారు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ వచ్చింది.
ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ విడుదల కానుందన్నది తాజా అప్డేట్. ఆ డేట్‌కి అయినా సినిమా వస్తుందా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.!
Also Read: Honey Rose.! నిజమే, వెండి తెర ‘తేనె గులాబీ’నే.!
సమంత అభిమానులు మాత్రం, ‘సమంతకే ఎందుకిలా అవుతోంది.?’ అంటూ గుస్సా అవుతున్నారు. సమంత అలా అనేస్తే.. ప్రభాస్ ఏమనాలి.?
సంక్రాంతికి రావాల్సిన ‘ఆది పురుష్’ వెనక్కి వెళ్ళిపోలేదా.? అఖిల్ ‘ఏజెంట్’ పరిస్థితి కూడా అంతే కదా.!