Samantha Shaakuntalam Disaster.. భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు.. కానీ, అది కాస్తా డిజాస్టర్ అయి కూర్చుంది. అదే ‘శాకుంతలం’. సినిమా అన్నాక హిట్టూ ఫట్టూ మామూలే.!
మెగాస్టార్ చిరంజీవికే తప్పలేదు.. ‘ఆచార్య’ అనూహ్యంగా డిజాస్టర్ అయ్యింది. ‘ఈరోజుల్లో సినిమా బావుంటేనే ప్రేక్షకులు చూస్తారు.. లేదంటే అంతే..’ అని చిరంజీవే ‘ఆచార్య’ ఫలితంపై తేల్చేశారు.
ఇక, అసలు విషయానికొస్తే, ‘శాకుంతలం’ డిజాస్టర్ నేపథ్యంలో జరుగుతున్న ట్రోల్స్‌పై నటి సమంత తనదైన స్టయిల్లో స్పందించింది.
Samantha Shaakuntalam Disaster.. కర్మ సిద్ధాంతం..
‘శాకుంతలం’ పేరు ఎక్కడా ప్రస్తావించలేదుగానీ, సమంత తాజాగా సోషల్ మీడియాలో ‘కర్మ’ సిద్ధాంతం చెప్పింది.
‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.. మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి’ అంటూ సాగే గీతా స్లోకాన్ని పేర్కొంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.
‘పని చేయడం వరకే నీకు అధికారం. దాని ఫలంతో నీకు సంబంధం లేదు. అందుకే, ప్రతిఫలం ఆశించి ఏ పనీ చేయకు.. అలా అని పని చేయడం మానకు.. ఇదీ ఆ గీతా శ్లోకం తాలూకు సారాంశం.
Also Read: Konidela Akira Nandan.. ఇంతకీ, అకిరానందన్ ఎవరి కొడుకు.?
‘విజయాలు వస్తుంటాయ్.. అపజయాలు ఎదురవుతాయి.. అయినా కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి’ అని సమంత, పరోక్షంగా ‘శాకుంతలం’ ఫలితంపై చెప్పిందమన్నమాట.
గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.