సమంత అక్కినేని.. షీ ఈజ్ క్యూట్.. షీ ఈజ్ హాట్.. షీ ఈజ్ బోల్డ్.. షీ ఈజ్ వైల్డ్.! చెప్పాలంటే చాలా చాలా క్వాలిటీస్ వున్నాయి సమంతలో. హీరోయిన్‌గా తెలుగులో తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా.. ఎన్నెన్నో విభిన్నమైన సినిమాల్ని చేసింది సమంత అక్కినేని (Samantha Akkineni Dashing Beauty).
‘పెళ్ళయితే మాత్రం, సినిమాల్లో ఎందుకు నటించకూడదు.? హీరోయిన్‌గా ఎందుకు స్టార్‌డమ్ పొందకూడదు.?’ అని ప్రశ్నించడమే కాదు, అక్కినేని నాగచైతన్యను పెళ్ళాడాక కూడా హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండడమే కాదు, సోషల్ సర్వీస్‌లోనూ తనకు తానే సాటి అన్పించుకుంది సమంత అక్కినేని.
తన గురించి వచ్చే గాసిప్స్‌పై సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడటం, అసలు విషయాన్ని కుండబద్దలుగొట్టేయడం.. వీలైతే, సెటైరికల్‌గానూ సమాధానమివ్వడం సమంతకి వెన్నతో పెట్టిన విద్య. గత కొంతకాలంగా సమంత ప్రెగ్నెన్సీపై కుప్పలు తెప్పలుగా గాసిప్స్ విన్పిస్తున్నాయి.
తాజాగా మళ్ళీ అలాంటి ప్రశ్నే ఎదురైతే, ‘2017 నుంచీ గర్భంతోనే వున్నాను..’ అంటూ మూడేళ్ళ నుంచీ వస్తున్న గాసిప్స్‌పై తనదైన స్టయిల్లో స్పందించింది ఈ అందాల భామ. కరోనా బ్రేక్ వేయబట్టి.. అందరితోపాటు సమంత కూడా కాస్త ఆగిందిగానీ.. లేదంటే, ఆమె షూటింగులతో బిజీ బిజీగా వుండేదే. తెలుగుతోపాటు, తమిళంలోనూ స్టార్ హీరోయిన్ అన్పించుకున్న సమంత, ఈ మధ్య ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే కన్పిస్తోంది.
దానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేవని, అవకాశాన్ని బట్టి తమిళంలోనూ సినిమాలు చేస్తాననీ సమంత తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా ఎంతకాలం సినిమాలు చేస్తారు.? అని అడిగితే, ‘అవకాశాలు వచ్చినంత కాలం.. ఆయా కథల్ని మెప్పించగలనన్న నమ్మకం నాకున్నంత కాలం’ అని సమంత ఓ ప్రశ్నకు బదులిచ్చింది.
అటు వైవాహిక జీవితం, ఇటు సినిమా కెరీర్.. రెండిటినీ బ్యాలెన్స్ చేయడంలో తన భర్త అక్కినేని నాగచైతన్య సపోర్ట్ చాలా చాలా ప్రత్యేకమని అంటోంది ఈ క్యూట్ ‘బేబీ’ సమంత. ‘రంగస్థలం’, ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’ తదితర సినిమాలు.. సమంత ఇమేజ్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్ళాయి. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో మెప్పిస్తానంటోంది సమంత అక్కినేని.