Samantha Vijay Kushi Love విజయ్ దేవరకొండ అభిమానులకి సమంత క్షమాపణ చెప్పింది.! కారణం ‘ఖుషీ’ సినిమా తన వల్ల ఆలస్యం కావడమే.!
మయోసైటిస్ అనే అనారోగ్య సమస్య కారణంగా సమంత కొన్ని రోజులపాటు.. కాదు కాదు, కొన్ని నెలల పాటు బయటకు రాలేకపోయింది.
వైద్య చికిత్స సమయంలో సమంత చాలా చాలా బాధనే అనుభవించింది. ఇప్పుడామె పూర్తిగా కోలుకుంది. ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది కూడా.
Samantha Vijay Kushi Love ట్రోలింగ్ నేపథ్యంలో క్షమాపణ..
తెలుగు సినిమాకి టైమ్ ఇవ్వకుండా, వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టావ్.. అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు గుస్సా అయ్యారు.
‘ఖుషీ’ సినిమా ఆగిపోవడం వల్ల విజయ్ వేరే సినిమాకి వెళ్ళలేకపోతున్నాడన్నది అతని అభిమానుల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే, సమంత విజయ్ దేవరకొండ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పింది.
త్వరలో ‘ఖుషీ’ షూటింగ్లో పాల్గొంటానని సమంత పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
నీ నవ్వు కోసం ఎదురుచూస్తున్నా..
‘పూర్తి ఆరోగ్యంతో.. నవ్వుతూ సెట్స్‌కి రావాలి.. నీ కోసం ఎదురుచూస్తుంటా..’ అంటూ విజయ్ దేవరకొండ సమాధానమిచ్చాడు సమంతకి సోషల్ మీడియా వేదికగా.
Also Read: వీర సింహా రెడ్డి: బాలయ్య చెప్పిన ‘చుట్ట’ కథ.!
విజయ్ ట్వీటుకి ‘గ్రేట్ఫుల్’ అంటూ సమంత స్పందించింది. అన్నట్టు, సమంత కోసం విజయ్ దేవరకొండ ఓ ‘లవ్ సింబల్’ని కూడా తన కామెంట్‌కి జత చేశాడండోయ్.!