Samyuktha The Black Gold.. పూర్తి పేరేమో సంయుక్త మీనన్.. కానీ, కేవలం సంయుక్తగానే పిలిపించుకోవడానికి ఇష్టపడుతుంటుంది ఈ బ్యూటీ.!
తెలుగులో రిలీజైన తొలి సినిమా ‘భీమ్లా నాయక్’ అయినా, ఆమె అంతకు ముందే, ఓ తెలుగు సినిమాకి సైన్ చేసింది.
‘బింబిసార’ సహా పలు సినిమాల్లో నటించిన సంయుక్తకి, పేరు తెచ్చిన సినిమా అంటే, ‘విరూపాక్ష’.! నిజానికి, ‘భీమ్లానాయక్’ సినిమాతోనే, ఆమెకి బోల్డంత పాపులరాిటీ వచ్చింది.
అయితే, ‘భీమ్లానాయక్’ సినిమాలో రాణాకి జోడీగా కనిపించింది సంయుక్త. ‘విరూపాక్ష’ సినిమాని ఫిమేల్ సెంట్రిక్ మూవీ తరహాలో మార్చేసింది సంయుక్త తన పెర్ఫామెన్స్‌తో.
Samyuktha The Black Gold.. ది బ్లాక్ గోల్డ్ సంయుక్త..
తాజాగా, ‘ది బ్లాక్ గోల్డ్’ అంటూ, దీపావళి పండక్కి పెద్ద షాకే ఇచ్చింది సంయుక్త. సంయుక్త నటిస్తున్న కొత్త సినిమా ఇది.!
ది బ్లాక్ గోల్డ్ అంటే తెలుసు కదా.. నల్ల బంగారం.! బొగ్గునే, నల్ల బంగారం.. అని పిలుస్తుంటారు. ఆ బొగ్గుకీ, ఈ సినిమాకీ ఏమన్నా సంబంధం వుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

‘ది బ్లాక్ గోల్డ్’ సినిమా నుంచి సంయుక్త లుక్‌ని దీపావళి సందర్భంగా రివీల్ చేశారు. మాంఛి యాక్షన్ ఫిలింలా కనిపిస్తోంది పోస్టర్ చూస్తోంటే.
Also Read: కామెడీ కాదు, ‘కామమ్ ర్యాంప్’.!
చేతిలో గన్ను, శరీరం నిండా గాయాలు.. చుట్టూ, శవాల గుట్టలు.. రైల్వే స్టేషన్ యాంబియన్స్.. వెరసి, ‘ది బ్లాక్ గోల్డ్’ పోస్టర్, అందులో సంయుక్త లుక్.. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.
ఈ సినిమాని ఫిమేల్ సెంట్రిక్ మూవీ.. అనుకోవచ్చు నిస్సందేహంగా. సంయుక్త చేసే పోరాటాలు, ఆమె పెర్ఫామెన్స్.. ఈ సినిమాకి హైలైట్ కానున్నాయట.
