తల్లి చిన్మయి, తండ్రి రాహుల్.! ఓ చిన్నారి.. వ్యధ.!
Chinmayi Rahul And Daughter.. కథ కాదిది.. ఓ చిన్నారి వ్యధ.! ఔను, తన తండ్రి తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడాన్ని రెండేళ్ళ చిన్నారి సహించలేకపోయిందిట.!
ఆ తండ్రి, ‘సర్లే’ అని సరిపెట్టుకున్నాడట.! సో, తండ్రులంతా ఇకపై ఇలానే చేయాలి. ‘నో’ అంటే, ‘నో’ మాత్రమే.. చిన్నప్పటినుంచే ఆడ పిల్లల్ని మగవాళ్ళు గౌరవించడం నేర్చుకోవాలిట.!
రెండేళ్ళ చిన్నారిని, తన తండ్రి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలనుకోవడం నేరమా.? సరే, ఏదో మూడ్‌లో ఆ చిన్నారి ‘ఊహూ’ అని మారాం చేయొచ్చు. దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలా.? అదీ సోషల్ మీడియాలో.
ఏమో, రాహుల్ రవీంద్రన్ విషయంలో అతని కుమార్తె ఎందుకు భయపడిందోనన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ఇక్కడ తల్లిదండ్రుల పెంపకం గురించిన అనుమానాలు పెరుగుతున్నాయ్.
Chinmayi Rahul And Daughter.. నాన్సెన్స్ కాకపోతే ఏంటిది.?
నాన్సెన్స్.. ఇలా ఎలా ఆలోచించగలం.? కదా.! మరి, చిన్మయి ఎలా రాహుల్ విషయమై తన కుమార్తె ‘మారాం’ చేయడాన్ని, ‘చైల్డ్ అబ్యూజ్’ వ్యవహారానికి ముడిపెట్టినట్లు.
రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు. తన భార్య చిన్మయి శ్రీపాద చెప్పింది కరెక్టేనని అన్నాడు. అది అతని హుందాతనం.
నిజమే, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయ్. అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ ఈ దారుణాలకు బలవుతున్నారు.
చిన్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తల్లిదండ్రులు తెలియజేయాలి. ఇది కూడా కాదనలేని వాస్తవం. కానీ, ఇదా పద్ధతి.?
రెండేళ్ళ చిన్నారి విషయంలో ఎందుకిలా.?
రెండేళ్ళ చిన్నారి.. అంటే, అప్పుడే లోకం చూడటం మొదలు పెడుతుందామె. తన తండ్రిని కూడా అందరి మగాళ్ళలో ఒకడిగా ఏ చిన్నారి అయినా చూడాలా.? ఇదెక్కడి వింత వాదన.?
అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. వారికి మొట్టమొదటి రక్షణ కవచం తల్లిదండ్రులే. తల్లి, కుమారుడ్ని ముద్దాడినా.. తండ్రి, కుమార్తెను ఆలింగనం చేసుకున్నా.. దాన్ని బూతులా చూస్తే, అదీ జుగుప్సాకరం.
Also Read: ఏం సదువులివి.? చదువుకీ చేసే పనికీ సంబంధమేంటి.?
ఏవో ఒకట్రెండు ఘటనలు కుటుంబ సభ్యుల మధ్య జుగుప్సాకరంగా జరిగితే మాత్రం, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ‘జనరలైజ్’ చేసెయ్యడం ఎంతవరకు సబబు.?
పబ్లిసిటీ స్టంట్స్ చేయడానికైనా ఓ హద్దుంటుంది. ఫెమినిజం పేరుతో ఏదైనా మాట్లాడేస్తామంటే కుదరదు.! నీ ఇంట్లో విషయాన్ని.. సీక్రెట్‌గా నీ ఇంట్లోనే పెట్టుకో చిన్మయీ.. అని చెప్పాల్సి వస్తోంది.!