Sana Makbul Khan Eyes.. సనా ఖాన్ అలియాస్ సనా మక్బూల్ అలియాస్ సనా మక్బూల్ ఖాన్ తెలుసా.? హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి చేసింది లెండి.!
అన్నట్టు, ఈ బ్యూటీ తెలుగులోనూ ఓ సినిమా చేసింది. అజయ్, నాగ శౌర్య కలిసి నటించిన ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాలోని బ్యూటీనే ఈ సనా మక్బూల్ ఖాన్.
తొలి తెలుగు సినిమాతో మంచి మార్కులే వేయించుకున్నా, ఎందుకో తెలుగునాట ఈ బ్యూటీకి సరైన అవకాశాలు దక్కలేదు. అడపా దడపా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా వుంటుంది ఈ బ్యూటీ.
Sana Makbul Khan Eyes.. కళ్ళు మాట్లాడతాయ్..
సోషల్ మీడియా వేదికగా మేగ్జిమమ్ గ్లామర్ షో ఎప్పుడో చేసేసిన సనా మక్బూల్ ఖాన్, తాజాగా కళ్ళతో మాట్లాడుకుందాం రండి.. అంటూ పిలుస్తోంది.
ఔను, కళ్ళలోనే చాలా భావాలు పలికేస్తాయ్ కొందరికి. సనా మక్బూల్ కూడా నటన పరంగా కళ్ళతోనే మ్యాజిక్ చేయగలదు. కానీ, అవకాశాలు రావొద్దూ.. టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి.

గ్లామర్ షో మీదనే ఎక్కువమంది హీరోయిన్లు ఆధారపడిపోతుంటారు. దర్శకులకీ, నిర్మాతలకీ కావాల్సింది అదేననుకోండి.. అది వేరే సంగతి.
ఇక, ప్రేక్షకుల సంగతి అంటారా.. ఆ ప్రేక్షకులకీ గ్లామర్ కావాల్సిందే మరి.! సినిమా అంటేనే గ్లామర్ కదా.!