Ramcharan JrNTR Side Artists.. ఇదెక్కడి పంచాయితీ.? మెయిన్ హీరోల్ని కాస్తా, సైడ్ ఆర్టిస్టులగా మార్చేస్తున్నారు పెయిడ్ ఆర్టిస్టులు.! సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ ఇది.!
ఆస్కార్ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ పురస్కారం దక్కింది. ప్రపంచమంతా, ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు రామ్ చరణ్, ఎన్టీయార్‌లను అభినందిస్తోంది.!
అభిమానుల్ని అదుపు చేయలేని దుస్థితి హీరోలకు ఎందుకొస్తోంది.?
తమ హీరోని పొగడటం తప్పు కాదు.! వేరే హీరోని తిట్టడం ముమ్మాటికీ తప్పే.!
అభిమానం దురభిమానంగా మారుతున్న వేళ, అభిమానానికీ కళ్ళెం వెయ్యాల్సిందే.!
లేకపోతే, కష్టపడి సాధించిన పేరు ప్రఖ్యాతుల్ని అభిమానుల కారణంగా హీరోలు దూరం చేసుకోవాల్సి రావొచ్చు.
అన్నదమ్ముల్లాంటి చరణ్, ఎన్టీయార్ మధ్య ‘దురభిమానం’ చిచ్చపెట్టడం క్షమార్హం కాదు.!
సినీ హీరోలకి ఇదొక హెచ్చరిక.
Mudra369
దురదృష్టం.. కొందరు మనలోనే వున్నారు.! ఆ కొందరు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని హీరోల్ని సైడ్ ఆర్టిస్టులగా పేర్కొంటున్నారు.
Ramcharan JrNTR Side Artists.. రామ్‌చరణ్, ఎన్టీయార్.. ఎవరు సైడ్ ఆర్టిస్ట్.?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని సైడ్ ఆర్టిస్టుగా కొందరు పెయిడ్ ఆర్టిస్టులు అభివర్ణిస్తున్నారు. దానికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ, జూనియర్ ఎన్టీయార్‌ని సైడ్ ఆర్టిస్ట్ అంటున్నారు.

రామ్ చరణ్ – ఎన్టీయార్.. ఈ ఇద్దరూ బాగానే వున్నారు. ‘మేమిద్దరం అన్నదమ్ములం’ అని చెబుతున్నారు. కానీ, అభిమానుల ముసుగులో కొందరు కేటుగాళ్ళు, ఇద్దర్నీ సైడ్ ఆర్టిస్టులుగా హేళన చేస్తున్నారు.
ఈ సైడ్ ఆర్టిస్టుల పంచాయితీ కాస్తా, తెలుగు సినిమాని.. జాతీయ స్థాయిలో చులకన చేస్తోంది. అంతర్జాతీయ సమాజం దృష్టిలోనూ పలచన చేస్తోంది.
Also Read: RRR Movie: జనం ‘ఛీ’ కొడుతున్నారు తమ్మారెడ్డీ.!
కాగా, ఎన్టీయార్.. ఆస్కార్ పురస్కారం చేత పట్టుకుని చేసిన ట్వీట్‌లో రామ్ చరణ్ పేరుని ప్రస్తావించకపోవడంతో, ‘సైడ్ ఆర్టిస్ట్‌ని పట్టించుకోని మెయిన్ హీరో..’ అంటూ ఎన్టీయార్ అభిమానులు రచ్చ చేస్తున్నారు.