Sandeep Reddy Vanga ANIMAL.. ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్‌లో సెటిలైపోయాడు. తాజాగా ‘ANIMAL’ సినిమాతో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు ఈ విలక్షణ దర్శకుడు.
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మండన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న ‘ANIMAL’ సినిమా నుంచి ప్రీ టీజర్‌ని విడుదల చేశారు.
ప్రీ టీజర్ నుంచి పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయడానికేమీ లేదు. కాకపోతే, సందీప్ రెడ్డి వంగా మేనియా.. ఆ కారణంగా, ఈ టీజర్‌కి విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది.
Sandeep Reddy Vanga ANIMAL.. రష్మిక ఆశలన్నీ ఈ సినిమాపైనే..
బాలీవుడ్‌లో రష్మిక ఇప్పటిదాకా చేసిన సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో, ఈ ‘ANIMAL’ మీద రష్మిక చాచాలా ఆశలే పెట్టుకుంది.

హీరోయిన్లని సందీప్ రెడ్డి వంగా చూపించే యాంగిల్ వేరే లెవల్‌లో వుంటుంది. ఆ లెక్కన, రష్మిక నుంచి ఓ బ్లాస్టింగ్ పెర్ఫామెన్స్.. అది నటన పరంగా అయినా, గ్లామర్ పరంగా అయినా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
రష్మిక, రణ్‌బీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ఆడియన్స్‌కి భారీ అంచనాలే వున్నాయ్ మరి.!
అదే టాలీవుడ్ హీరో అయ్యుంటే..
రణ్‌బీర్ కపూర్ మంచి నటుడు.. కానీ, అతని కంటే టాలీవుడ్ హీరోలెవరైనా ఈ సినిమాలో నటించి వుంటే బావుండేదేమో.!
ఔణు, స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలతో పోల్చితే, సౌత్ సినిమాలు.. నార్త్ బెల్ట్‌లో బాగా ఆడుతున్నాయి. బాలీవుడ్ సినిమాలేమో, సౌత్‌లో నిలబడటంలేదు.
Also Read: అనసూయపై విజయ్ దేవరకొండ ‘పెయిడ్’ ట్రోలింగ్.?
ఆ లెక్కన, ‘ANIMAL’ సినిమాని సౌత్ హీరోతో.. అందునా, తెలుగు హీరోతో గనుక సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించి వుంటే.. ఆ కిక్కు వేరేలా వుండేదేమో.!