అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గేర్’ మార్చినట్లే కనిపిస్తోంది. నిజానికి, ఆ వెంటనే ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata Blaster Teaser) సినిమాని తీసుకొచ్చేయాలనుకున్నారుగానీ, కరోనా పాండమిక్, సూపర్ స్టార్ మహహేష్ స్పీడుకి బ్రేకులేసింది.
లేటయినా, లేటెస్ట్‌గా వచ్చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ (Super Star Maheshbabu) ‘సర్కారు వారి పాట’తో. వచ్చే సంక్రాంతికి, థియేటర్లు దద్దరిల్లిపోనున్నాయ్. ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్.. (Sarkaru Vaari Paata Blaster) అదేనండీ టీజర్ చూస్తే, మహేష్ కెరీర్‌లో ఇదో సూపర్ డూపర్ కమర్షియల్ హిట్ అయ్యేలా వుందని అనిపించకమానదు.
హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఓ సన్నివేశంలో, ‘సారుకి దిష్టి తీయాల్సిందే..’ అంటుంది. నిజమే, టీజర్ చూశాక చాలామంది ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తారు. మహేష్ స్టైలింగ్ కూడా చాలా కొత్తగా వుందీ ‘సర్కారు వారి పాట’లో. సినిమాలో బీభత్సమైన యాక్షన్ కూడా వున్నట్లే కనిపిస్తోంది.
Also Read: అయ్యోపాపం.. ‘పాప’కి అస్సలేపాపమూ తెలీదంట.!
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ.. అన్నీ టాప్ క్లాస్.. అన్నట్టుగానే వున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో ఈ ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata Blaster Teaser) సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే.
Also Read: RRR Movie కి ప్లస్సూ అదే.. మైనస్సూ అదే.!