Sarkaru Vaari Paata Collections.. ‘సర్కారు వారి పాట’ సినిమాకి తొలి రోజు నెగెటివ్ టాక్ వచ్చినా, మిక్స్‌డ్ టాక్ కొనసాగుతున్నా, వసూళ్ళు అదరహో.. అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ అభిమానులు.
నిర్మాతలెలాగూ తమ సినిమా సూపర్ హిట్.. అంటూ పోస్టర్లు వదులుతారనుకోండి.. అది వేరే వ్యవహారం. ప్రతి సినిమాకీ జరిగే తంతు ఇదే.!
ఇంతకీ, ‘సర్కారు వారి పాట’ అసలు టాక్ ఏంటి.? అడ్వాన్స్ బుకింగుల జోరు తక్కువగా వుండటమే కాదు, చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా వున్నాయనే ప్రచారమైతే తొలి రోజు గట్టిగా జరిగింది. రెండో రోజూ అదే పరిస్థితి కొనసాగుతోంది.
ఇంకోపక్క, నైజాంలో ‘భీమ్లానాయక్’ తొలి రోజు రికార్డుని ‘సర్కారు వారి పాట’ కొట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన నెంబర్స్ పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
Sarkaru Vaari Paata Collections.. సినిమా అంటేనే మాయాజాలం.!
నిజానికి, సినిమా అంటేనే అదో మాయాజాలం. వసూళ్ళ వ్యవహారం మరింత మాయాజాలం. ఏ పెద్ద హీరో సినిమాలూ ఇందుకు అతీతం కాదు. చిన్న సినిమాల హీరోలు సైతం వసూళ్ళ మాయాజాలం చేస్తున్నారు.
మహేష్ (Super Star Maheshbabu) సినిమాల విషయంలో ఈ ‘మాయ’ మరీ ఎక్కువగా జరుగుతుంటుంది.. బహుశా అదంతా నిర్మాతలు, అభిమానులు, పీఆర్ టీమ్స్ అత్యుత్సాహం వల్లే కావొచ్చు.
ఈ ఫేక్ వ్యవహారాల సంగతి పక్కన పెడితే, ‘సర్కారు వారి పాట’ తొలి రోజు డీసెంట్ నంబర్స్ రిజిస్టర్ చేసిందనేది నిర్వివాదాంశం. లాంగ్ వీకెండ్ కూడా ‘సర్కారు వారి పాట’కి కలిసి రానుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

మహేష్ అభిమానులు కావొచ్చు, పీఆర్ బృందాలు కావొచ్చు.. వీళ్ళు చేసే అతి కారణంగా, ‘సర్కారు వారి పాట’పై మరింత నెగెటివిటీ పెరిగే ఆస్కారముంది.
Also Read: ఏంటి దేవీ మరీనూ.! విశ్వక్ సేనుడి ‘రగడ’తో ఏం సాధించినవ్.!
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
చివరగా.. వేరే హీరోలకు సంబంధించిన సినిమాలకు వసూళ్ళ పరంగా రియల్ నంబర్స్ వచ్చినా, వాటిని ఫేక్ అని ప్రచారం చేయడం ద్వారా, మహేష్ అభిమానులిప్పుడు.. ఆయా హీరోల అభిమానుల నుంచి ‘హీట్’ ఎదుర్కోవాల్సి వస్తోంది.