Sarkaru Vaari Paata Final Result.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా వసూళ్ళ పర్వం దాదాపు ముగింపుకి వచ్చేసింది.
అబ్బే, ఎప్పుడో సినిమా కథ కంచికి చేరిపోయింది.. దాన్ని ఇంకా ఇంకా సాగదీస్తున్నారనే విమర్శలు లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి.
‘ఆచార్య’ (Acharya Movie) సినిమా తరహాలోనే ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమాకి కూడా విపరీతమైన నెగెటివిటీ కనిపించింది. అయితే, ‘ఆచార్య’ సినిమాని ఆ తర్వాత అస్సలు ప్రమోట్ చేయలేదు.
కానీ, ‘సర్కారు వారి పాట’ కోసం ప్రమోషన్స్ విపరీతంగా చేశారు. పీఆర్ టీమ్స్ బీభత్సంగా పని చేశాయి. ఈ క్రమంలో డిజాస్టర్ అనుకున్న సినిమా కాస్తా, కొంచెం పుంజుకున్నమాట వాస్తవం.
Sarkaru Vaari Paata Final Result.. ఫస్ట్ డే టాక్ వర్సెస్ ఫైనల్ రిజల్ట్.!
తొలి రోజు ‘సర్కారు వారి పాట’ సినిమాకి వచ్చిన టాక్, ఆ తర్వాత సినిమా పుంజుకున్న వైనం చూస్తే, ఇదంతా మహేష్ మ్యాజిక్ అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే.
Also Read: కొరటాలకి ‘ఆచార్య’ సెగ.! ఎన్నేళ్ళు వెంటాడుతుందో.!
‘సర్కారు వారి పాట’ బ్రేక్ ఈవెన్ అయిపోయిందనీ, లాభాలు షురూ అయ్యాయనీ ఓ వాదన బలంగా తెరపైకొచ్చింది. లాభాల సంగతి దేవుడెరుగు, అసలు బ్రేక్ ఈవెన్‌కే చాలా దూరంలో ‘సర్కారు వారి పాట’ వుందన్నది మరో వెర్షన్.

ఏది నిజం.? ఎలాగూ, మేకర్స్ అధికారికంగా వసూళ్ళ వివరాలు వెల్లడించరు.
పోస్టర్లలో కనిపించే నెంబర్లను నమ్మడానికి వీల్లేదని ప్రముఖ నిర్మాత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇటీవలే టాలీవుడ్‌లో కలెక్షన్ల బాగోతాన్ని బయటపెట్టేశాడాయె.!
సినిమా ‘దొబ్బింది..’ అని పైశాచిక ఆనందం పొందేవారు.. ‘సూపర్ హిట్..’ అని అతి చేసేవారు ఎప్పుడూ వుంటారు అగ్ర హీరోల విషయంలో. ఈ మధ్య యంగ్ హీరోలకీ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందనుకోండి.. అది వేరే విషయం.
సినిమా.. అప్రమత్తమవ్వాల్సిందే సుమా.!
సరే, ఎవరు ఏమనుకున్నాగానీ.. ‘సర్కారు వారి పాట’ సినిమాతో కాస్త జోష్ కనిపించింది సినీ పరిశ్రమలో కొన్ని రోజులపాటు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఈ జోష్ కనిపించడాన్ని స్వాగతించాల్సిందే.
పెద్ద సినిమాలు బడ్జెట్టుని తగ్గించుకోవడంతోపాటు, బిజినెస్ వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్తగా వుంటే, నష్టపోయే అవకాశాలు తక్కువగా వుంటాయ్.! కానీ, అది సాధ్యమయ్యే పని కాదు.
Also Read: ఎన్టీయార్ శత జయంతి.! వెన్నుపోటు సంగతేంటి.?
‘ఓటీటీలో చూసుకుందాం లే..’ అనే భావన ప్రేక్షకుల్లో పెరిగిపోవడం, సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచేసి, ప్రేక్షకుల్ని సినిమాకి దూరం చేసెయ్యడం.. ఇలా చాలా అంశాలు, సినిమాల ఫలితాలపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయ్.
చివరగా, ‘సర్కారు వారి పాట’ సినిమా 30 నుంచి 50 కోట్ల దాకా థియేట్రికల్ రైట్స్ విషయంలో నష్టాన్ని చవిచూసిందన్నది ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోన్న వాదన.
అంతకన్నా ఎక్కువే నష్టం జరిగి వుండొచ్చనేవారూ లేకపోలేదు. ఏదినిజం.? అది మాత్రం సస్పెన్స్.!