Sarkaru Vaari Paata Live Review.. సూపర్ స్టార్ జాతర షురూ అయ్యింది. ‘సర్కారు వారి పాట’ కోసం థియేటర్లన్నీ కొత్త శోభని సంతరించుకున్నాయి.
కనీ వినీ ఎరుగని రీతిలో సూపర్ స్టార్ మహేష్ అభిమానులు, ‘సర్కారు వారి పాట’ సినిమాని ఓ వేడుకగా మార్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో.. ఎక్కడ చూసినా ఒకటే సందడి.
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్‌బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా రూపొందిన ‘సర్కారు వారి పాట’పై అంచనాలు అంతకు మించి అనే స్థాయిలో వున్నాయి.
‘సర్కారు వారి పాట’ సినిమా కథా కమామిషు ఏంటి.? సినిమా ఎలాంటి వసూళ్ళను సాధించబోతోంది.? తొలి రోజు రికార్డుల మాటేమిటి.? తొలి వారం వసూళ్ళ సునామీ ఎలా వుండబోతోంది.? ఇలా అంచనాలేసుకోవడంలో ట్రేడ్ పండితులు బిజీ అయిపోయారు.
Sarkaru Vaari Paata Live Review.. ఇదిగో ఇక్కడే.!
ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట‘ లైవ్ అప్డేట్స్ యూఎస్ (అమెరికా)లోని థియేటర్ నుంచి నేరుగా ఇచ్చేందుకు ‘ముద్ర 369’ సిద్ధమయ్యింది.
ఆలస్యం ఏమీ లేదు.. బొమ్మ పడీ పడగానే, అప్డేట్స్ ఇక్కడ ప్రత్యక్షమైపోతాయ్.! గెట్ రెడీ ఫర్ లైవ్ రివ్యూ అప్డేట్స్.!
బొమ్మ పడింది.. షో టైమ్..
సినిమా మొదలైంది.. ఎమోషనల్ నోట్‌తో ప్రారంభమైంది..
మహేష్‌బాబు ఎంట్రీ.. అభిమానుల ఈలలు గోలలతో థియేటర్ మార్మోగిపోతోంది..
సూపర్ హ్యాండ్సమ్ లుక్.! మహేష్ వయసు పెరుగుతోందో, తగ్గుతోందో అర్థం కావడంలేదనిపిస్తుంది..
ఫైనాన్స్ కంపెనీ అధినేతగా మహేష్.. సూపర్బ్ యాక్షన్ బ్లాక్.. హీరోయిజం ఎలివేషన్ అదుర్స్..
పెన్నీ సాంగ్.. మహేష్ అభిమానులకి కన్నుల పండగే..
పాట చిత్రీకరణ బావుంది. డాన్స్ మూమెంట్స్ కొత్తగా వున్నాయ్..
కిశోర్‌గా వెన్నెల కిషోర్ ఎంట్రీ..
కాసినోలో అల్ట్రా మోడ్రన్ బ్యూటీలా కళావతి పాత్రలో కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చింది..
తన అందంతో మహేష్‌ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోన్న కీర్తి సురేష్..
సరికొత్త మహేష్‌ని తెరపై చూసి మురిసిపోతున్న అభిమానులు..
హీరో హీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండుతోంది.. ఈ ఇద్దరి నడుమ వెన్నెల కిశోర్ తనదైన స్టయిల్లో కామెడీ పండిస్తున్నాడు..
కళావతి సాంగ్.. మహేష్, కీర్తి సురేష్.. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.. చాలా అందంగా కొరియోగ్రఫీ చేయబడింది..
ఇక్కడో ట్విస్ట్.. హీరో మహేష్‌బాబు ఇండియాకి తిరిగొస్తాడు..
బీచ్ ఫైట్‌ని బాగా డిజైన్ చేశారు. మాస్ ఆడియన్స్‌కి పూనకాలే..
ఏసీపీ పాత్రలో అజయ్ ఎంట్రీ.. ఇంట్రెస్టింగ్ ట్విస్టుతో ఇంటర్వెల్..
ఫస్ట్ హాఫ్ రివ్యూ.. మహేష్‌బాబు సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోశాడు. కీర్తి సురేష్ క్యూట్‌గా కనిపించింది.. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మాస్ మెచ్చే అంశాలతోపాటు, క్యూట్ లవ్ స్టోరీ ఫ్యామిలీ ఆడియన్స్‌నీ, ముఖ్యంగా యూత్‌ని ఇంకా బాగా ఎట్రాక్ట్ చేస్తుంది.
నదియా, ఆమెకీ మహేష్‌కీ, సముద్రఖనికీ మధ్య ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు.
మరో ఆసక్తికరమైన పాత్రలో బ్రహ్మాజీ. సముద్ర ఖనికి గురించి కొన్ని విషయాల్ని వెల్లడిస్తుంది నదియా.
సుబ్బరాజుతో కలిసి కీర్తి సురేష్ రీ-ఎంట్రీ. మహేష్ – కీర్తి మధ్య కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు.
మమ మహేషా సాంగ్.. థియేటర్లలో అభిమానుల డాన్సులు.. బ్యాంకింగ్ అక్రమాలు, లోన్ల గురించిన సన్నివేశాలు, డైలాగులు.. క్లయిమాక్స్ దిశగా సినిమా.. పవర్ ప్యాక్డ్ క్లయిమాక్స్..
సెకెండాఫ్ రివ్యూ.. మహేష్‌బాబు అభిమానులకి ఫుల్ మీల్స్ అంతే..
ఓవరాల్‌గా అయితే, కొంత సాగతీత, ఫ్లాట్‌గా నడిచే సన్నివేశాలు వున్నా, మహేష్ అభిమానులకి ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్.
ఫైనల్ రివ్యూ కోసం ఈ స్పేస్ చూస్తూనే వుండండి..