Sarkaru Vaari Paata Trailer: సినిమా తీరు తెన్నులు మారాయ్. మాస్ కంటెంట్ నుంచి, బూతు స్టఫ్ వైపు నడుస్తోంది ట్రెండు. అవసరం వున్నా, లేకున్నా, లిప్‌లాక్ సీన్లు తప్పనిసరైపోయాయ్.
సెన్సార్ బోర్డు ఏం చేస్తోందో కానీ, బూతులు యధేచ్చగా నటీ నటుల నుంచి వచ్చేస్తున్నాయ్. అదే, మాంచి స్టఫ్ అవుతోంది సో కాల్డ్ న్యూ జనరేషన్ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కి.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) తాజా సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి ట్రైలర్ వచ్చింది. విజువల్స్ అదిరిపోయాయ్. సౌండింగ్ కెవ్వు కేక. మహేష్ బాబు మరీ కుర్రాడయిపోయాడు. కీర్తి సురేష్ (Keerthy Suresh) క్యూట్‌గా వుంది.
వెన్నెల కిషోర్ నవ్వులు పండించాడు. సముద్ర ఖని ప్రామిసింగ్ విలనిజం చూపించాడు. డైరెక్టర్ మేకింగ్ స్టైల్ అదిరిపోయింది. మహేష్ డాన్సులు సూపర్బ్.
Sarkaru Vaari Paata Trailer.. మహేష్‌బాబూ.! నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది.?
కానీ, అవసరమా.. ఆ బూతులు.? ‘దీనెమ్మా.. మెయింటైన్ చేయలేక దూల తీరిపోతంది..’ అంటూ మహేష్ ఓ డైలాగ్ చెబుతాడు.
ఇలాంటి ఆణిముత్యాలు ట్రైలర్‌లోనే మరిన్ని వున్నాయ్. సినిమాలో ఇంకెన్ని వుంటాయో.! ఊహించుకుంటేనే కష్టంగా అనిపిస్తోంది.
అబ్బే..! ఆ మాత్రం బూతులు లేకపోతే అది మాస్ కాదు. వీటినే ‘బూతులు’ అంటే టేస్ట్ లేనట్టే.. అని మహేష్ అభిమానులు ట్రోలింగ్‌కి దిగిపోతారంటారా.? అయితే ఈ ‘బూతు’ డైలాగ్ సంగతేంటి మరి.
ప్చ్.! మహేష్‌బాబు మాట.. కాస్తంత కష్టమే సుమీ.!
‘ఎందుకంటే ఆడిది మరీ ఇంత పెద్ద.. ’ అనే డైలాగ్ చెప్పే క్రమంలో మహేష్ చూపించిన పోజు అబ్బో.. ! మరీ అభ్యంతరకరంగా వుంది.
మహేష్‌లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ వున్నోడు ఇంత చీప్‌గా ఎందుకు వ్యవహరించినట్లు.? ఏమో ఆయనకే తెలియాలి.
ట్రైలర్ విడుదలైన కాస్సేపటికే వ్యూస్ పోటెత్తేస్తున్నాయ్. మహేష్ సినిమా కదా.. ఆ మాత్రం హంగామా లేకపోతే ఎలా.?

ఏ మాటకామాటే చెప్పుకోవాలంటే, మహేష్ గత చిత్రాలు ‘ఖలేజా’, ‘ఆగడు’ షేడ్స్.. ఈ ‘సర్కారు వారి పాట’లో బాగా కనిపిస్తున్నాయ్. ‘సరిలేరు నీకెవ్వరూ..’ టచ్ కూడా కనిపిస్తోంది. మహేష్ టైమింగ్, ఎనర్జీ టాప్ క్లాస్.
ఆ బూతులే.. జీర్ణించుకోవడం చాలా చాలా కష్టమే. ‘ఈ అమ్మాయి విషయంలో మీరేంటి సార్ ఇంతలా దిగజారిపోయారు..’ అంటాడు ఓ సన్నివేశంలో వెన్నెల కిషోర్ (Vennela Kishore).
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
సన్నివేశంలో సంగతేమోగానీ, అలవోకగా బూతుల్లాంటి డైలాగులతో మహేష్ (Super Star Maheshbabu) దిగజారిపోయాడన్న విమర్శ అయితే గట్టిగా వినిపిస్తోంది. దర్శకుడు పరశురామ్ ఇంత పని చేశాడేంటీ.?