Table of Contents
Sarzameen Telugu Review.. తండ్రి మీద ద్వేషం పెంచుకున్న కొడుకు.. దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే తండ్రి.. తండ్రి మీద ద్వేషంతో, దేశం మీద దాడికి ప్రయత్నించే కొడుకు.. ఇదీ Sarzameen కథ.
తీవ్రవాదం నేపథ్యంలో కుప్పలు తెప్పలుగా సినిమాలొచ్చాయ్.. వస్తూనే వున్నాయ్.! కొన్ని మనసుకి హత్తుకున్నాయ్.. కొన్ని, దేశభక్తిని పెంపొందించాయ్.
చాలా అరుదుగా మాత్రమే, ఈ తరహా సినిమాలు ఫెయిల్ అవుతుంటాయ్. ఎందుకంటే, తీవ్రవాదం నేపథ్యంలో వచ్చే సినిమాలనీ, దేశ భక్తిని రగుల్చుతుంటాయ్ గనుక.
Sarzameen Telugu Review.. సర్‌జమీన్ ఎలా వుంది.?
ఇంతకీ, Sarzameen ఎలా వుంది.? పృధ్వీరాజ్ సుకుమారన్ ఎలా చేశాడు.? కాజోల్ దేవగన్, ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అయ్యిందా.?
సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటుడిగా మెప్పించాడా.? బోమన్ ఇరానీ తనయుడు కయోజ్ ఇరానీ దర్శకత్వమెలా వుంది.? తెలుసుకుందాం పదండిక.!
తెలుగు సినీ అభిమానులకి పృధ్వీరాజ్ సుకుమారన్ సుపరిచితుడే. బోమన్ ఇరానీ అంటే, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో, పవన్ కళ్యాణ్‌కి తాతయ్య పాత్రలో కనిపించాడు కదా.!
సైఫ్ అలీ ఖాన్‌ని ‘దేవర’ సినిమాలో విలన్‌గా చూశాం.! బాలీవుడ్ నటి అయినా, కాజోల్ దేవగన్ తెలుగు సినీ అభిమానులకీ సుపరిచితురాలే.
సో, అలా, Sarzameen తెలుగు సినీ అభిమానుల్నీ ఎట్రాక్ట్ చేసింది. ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన సినిమా (డైరెక్ట్ ఓటీటీ రిలీజ్) కావడంతో, బాగానే చూసేశారు.
నటీనటులు ఎలా చేశారు.?
కథ గురించి ముందే చెప్పేసుకున్నాం కదా. నటీనటుల నటనా ప్రతిభ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆయా నటుల స్థాయికి తగ్గ బలంగా పాత్రల్ని దర్శకుడు రూపొందించలేకపోయాడు.
పృధ్వీరాజ్ సుకుమారన్ సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఓకే. కానీ, అతన్నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. ఇబ్రహీం అలీ ఖాన్ ‘మమ’ అనిపించాడు.
కాజోల్ దేవగన్ పాత్రకి చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బావున్నా, అంతకు ముందు వరకూ.. ఆమెనీ సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. బోమన్ ఇరానీ పాత్ర సైతం వృధా అయ్యింది.
నిజానికి, ఈ తరహా సినిమాలు, కథలోకి ప్రేక్షకుల్ని వేగంగా తీసుకెళతాయి, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తాయ్. కానీ, సినిమా అలా అలా సాగిపోతుందంతే.
సాధారణంగా వున్నాయంతే..
మంచి నటీ నటులున్నారు గనుక, వారి నుంచి మంచి నటనా ప్రతిభని ఆశిస్తే మాత్రం, సినిమా పూర్తిగా నిరాశపరుస్తుంది.
ఈ తరహా సినిమాలకి స్టంట్ కొరియోగ్రఫీ చాలా ముఖ్యం. పోరాట సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. డైలాగ్స్ కూడా సోసోగానే వున్నాయి.
హింస, రక్తపాతం చూపిస్తూనే, కశ్మీర్ అందాల్ని అత్యద్భుతంగా ఇలాంటి సినిమాల్లో చూపిస్తుంటారు. ఆ విషయంలోనూ, అరకొర మార్కులే పడతాయి.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్నీ సాధారణంగా వున్నాయంతే. చాన్నాళ్ళ క్రితం వచ్చిన ‘బిచూ’ అనే సినిమాలో బాబీ డియోల్ పాత్ర, ఇప్పటికీ మనల్ని వెంటాడుతుంది.
ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, Sarzameen సినిమాకి సాధ్యపడలేదు. ఓవరాల్‌గా ఓటీటీలో వన్ టైమ్ వాచ్ వరకూ ఓకే.