పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని (Power Star Pawan Kalyan) దేవుడిగా భావించే చాలామంది అభిమానుల్లో తమన్ కూడా ఒకడు. ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి ‘సత్యమేవజయతే’ (Sathyameva Jayathe Song Review Vakeel Saab) అనే పాట కొన్నేళ్ళపాటు అందరికీ గుర్తుండిపోతుందని తమన్ ఊరికినే చెప్పలేదు. ఆ పాటలో ‘డెప్త్’ ఏంటో తమన్‌కి బాగా తెలుసు.
పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే తన లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అని భావించిన తమన్‌కి (SS Thaman), తనకి దక్కిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసు. అందుకేనేమో, పాట అదరగొట్టేశాడు. కాదు కాదు, పాటలన్నీ అదరగొట్టేశాడు. ఇప్పటికే ఓ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
తాజాగా వచ్చిన రెండో సాంగ్, అంతకు మించి విజయాన్ని అందుకుంటుందని.. పాటకంటే ముందే అంతా ఫిక్సయిపోయారు. ‘జన జన జన..’ అంటూ మొదలైంది పాట. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వమేంటో పాటలో దాదాపుగా చెప్పేశాడు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.
‘ఈసారి గట్టిగానే..’ అని రామజోగయ్య శాస్త్రి, తమన్ గురించి చెప్పినట్టుగానే వుంది పాట. సినిమా (Sathyameva Jayathe Song Review Vakeel Saab) సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా వున్నారు గనుక, ఇది నికార్సయిన పొలిటికల్ సాంగ్ అనే భావన అందరికీ కలుగుతోంది.
‘ఇలాంటి పాట ఎన్నికల సమయంలో వదిలితే.. జనసైనికుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది..’ అంటూ చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ‘వకీల్ సాబ్’ (Vakeel Saab), బాలీవుడ్ సినిమా ‘పింక్’కి తెలుగు రీమేక్.
తమిళంలోనూ రీమేక్ అయి, అక్కడా మంచి విజయాన్నే అందుకుంది. నిజానికి ఇది కమర్షియల్ సబ్జెక్ట్ కానే కాదు. అయినా, హిందీలో హిట్టయ్యింది.. తమిళంలో అంతకు మించిన విజయాన్ని అందుకుంది. మరి, తెలుగులో ఈ సినిమా విజయం ఎలా వుండబోతోంది.? అది తెలియాలంటే, సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.
ఇక, ‘సత్యమేవజయతే’ పాట ‘వకీల్ సాబ్’ సినిమా వచ్చేంతవరకే కాదు, జనసేన పార్టీ (Sathyameva Jayathe Song Review Vakeel Saab) వున్నంతవరకు.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వున్నంతకాలం మార్మోగుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.