Jamuna NTR ANR తెలుగు సినీ పరిశ్రమకి రెండు కళ్ళుగా చెబుతారు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గురించి.
‘అదంతా ట్రాష్.. మేం రెండు కళ్ళయితే.. ఎస్వీ రంగారావు, సావిత్రి, జమున, రేలంగి.. వీళ్ళంతా ఎవరు.?’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో తనదైన స్టయిల్లో వ్యాఖ్యానించారు.
నిజానికి, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తే డైనమిజం రాదు.. ఆ డైనమిజం హీరోలతో సినిమాలు చేసినప్పుడు కూడా ప్రదర్శించొచ్చంటారు జమున.
Mudra369
నిజమే, తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప గొప్పవాళ్ళెందరో వున్నారు. ఆ లిస్టులో ‘సిల్వర్ స్క్రీన్ సత్యభామ’ జమను కూడా ఒకరు.!
Jamuna NTR ANR ఎన్టీయార్, ఏయన్నార్లను ధిక్కిరించి..
ఒకానొక సమయంలో ఎన్టీయార్తోగానీ, ఏయన్నార్తోగానీ సినిమాలు చేయనని భీష్మించుక్కూర్చున్నారు జమున. ఆమెతో సినిమాలు చేయడానికి ఎన్టీయార్, ఏయన్నార్ దిగి రావాల్సి వచ్చింది.

‘గుండమ్మ కథ ఆనాటి ఆ వివాదాన్ని కాంప్రమైజ్ చేసింది’ అంటారామె. ‘నేనైతే తగ్గలేదు.. వాళ్ళే మీటింగ్ ఏర్పాటు చేశారు..’ అని ఆనాటి ఆ గొడవ, సర్దుబాటు గురించి జమున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
పురుషాధిక్యం సినీ పరిశ్రమలో ఎక్కువగా వుండేదనీ, ఆ సమయంలో భానుమతి.. తాను ధైర్యంగా నిలబడ్డామనీ, సావిత్రి సైతం తిరుగులేని స్టార్డమ్ కొనసాగించారని జమున చెప్పుకొచ్చారు.
జమునని తొక్కేద్దామనుకున్నారా.?
‘నన్ను తొక్కేద్దామనుకున్నారు.. కానీ, వారి ప్రయత్నాలు సఫలం కాలేదు..’ అని స్వయంగా ఓ సందర్భంలో ఎన్టీయార్, ఏయన్నార్ గురించి జమున చెప్పడం గమనార్హం.
Also Read: ‘తొక్కినేని’ రచ్చ: బాలకృష్ణని నాగార్జున ఏమీ పీకలేడా.?
నిజానికి, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తే డైనమిజం రాదు.. ఆ డైనమిజం హీరోలతో సినిమాలు చేసినప్పుడు కూడా ప్రదర్శించొచ్చంటారు జమున.
బహుశా అదే.. ఆ డేరింగ్ అండ్ డాషింగ్ నైజమే.. ఈ అందమైన సత్యభామకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టిందేమో.!
తెలుగు తెరపై అసలు సిసలు ‘కథానాయిక’ అనదగ్గరవారిలో జమున వెరీ వెరీ స్పెషల్.. అనేది అందుకే.!