Seerat Kapoor Allu Arjun అదేంటీ.! అల్లు అర్జున్ పక్కన సీరత్ కపూర్ కనిపిస్తోంది.! పైగా, ఎగిరిపోతామంటోంది.!
ఎవరీ సీరత్ కపూర్.? అల్లు అర్జున్ పక్కన ఎందుకు కనిపిస్తోంది.? ఈ సీరత్ కపూర్ ఎవరో కాదు, ‘రన్ రాజా రన్’ హీరోయిన్.!
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసింది సీరత్ కపూర్. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుందీ భామ.!
కానీ, వరుసగా ఆ తర్వాత ఫ్లాపులు చవిచూసింది.! దాంతో, దాదాపుగా తెలుగు తెరపైనుంచి కనుమరుగైపోయిందీ బ్యూటీ.! కథల ఎంపికలో పొరపాట్ల దగ్గర్నుంచి.. టైమ్ కలిసి రాకపోవడం వరకు.. అన్నీ దెబ్బ కొట్టేశాయ్.!
నటి మాత్రమే కాదు.. డాన్సర్ కూడా.!
సీరత్ కపూర్ నటి మాత్రమే కాదు, డాన్సర్ కూడా.! డాన్సర్ అంటే, సాదా సీదా డాన్సర్ కాదు. కొరియోగ్రాఫర్ స్థాయి ఆమెది.!
ఇక, అల్లు అర్జున్ (Allu Arjun) గురించి కొత్తగా చెప్పేదేముంది.? స్టైలిష్ అండ్ ఐకానిక్ డాన్సర్ అల్లు అర్జున్.

అల్లు అర్జున్ – సీరత్ కపూర్ (Seerat Kapoor) కలిశారంటే, ఏదో విశేషమే వుండి వుండాలి.! ‘పుష్ప ది రూల్’ కోసం సీరత్ కపూర్ కొరియోగ్రఫీ పరంగా ఏమైనా సాయం చేస్తోందా.?
కాదు కాదు, ‘పుష్ప ది రూల్’ సినిమాలో సీరత్ కపూర్ స్పెషల్ సాంగ్ చేసేస్తోందేమో.! ఏమో, ఏదైనా కావొచ్చు.! బన్నీ తలచుకుంటే, సీరత్ కపూర్‌తో ‘పుష్ప ది రూల్’ కోసం మాంఛి మాస్ బీట్‌కి చిందెయ్యడం పెద్ద కష్టమా.?
Seerat Kapoor Allu Arjun రెక్కలు అవసరం లేదు..
డాన్సర్లకు ఎగిరేందుకు రెక్కలు అవసరం లేదు.! వారి ఎనర్జీనే, వారిని ఎగిరేలా చేస్తుంది.. ఇదీ సీరత్ కపూర్, సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ట్వీట్ సారాంశం.!
Also Read: విజయ్ దేవరకొండ ‘The’పై అనసూయ అక్కసు.!
నిజమే సుమీ.. డాన్స్ చేస్తే.. డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోవడమే కాదు.. అసలు నేల మీద వున్నారా.? గాల్లో తేలుతూ డాన్స్ చేస్తున్నారా.? అనిపిస్తుంటుంది కొందర్ని చూస్తే.