Table of Contents
Sehari Telugu Movie Review: కన్‌ఫ్యూజన్‌లో వుండే సగటు కుర్రోడి చుట్టూ ఎన్ని కథలైనా అల్లుకోవచ్చు. కథనం కొంచెం కొత్తగా వుంటే సరిపోతుంది. అది లేకపోయినా సరదా సన్నివేశాలతో నడిపేసినా సినిమా గట్టెక్కేస్తుంది.
సెహరి (Sehari).. కూడా అలాంటి ఓ మామూలు సరదా సినిమా. ఇంతకీ ‘సెహరి’ అంటే ఏంటీ.? ‘సెహరి’ అంటే సెలబ్రేషన్ అట. ‘సెహరి’ అన్న పదం వినడానికి కొంత కొత్తగా అనిపించింది. నటీ నటుల్లో దాదాపు అందరూ పెద్దగా పరిచయం లేని వాళ్లే.
Sehari Telugu Movie Review.. ఇది చాలా బావుందే..!
‘ఇది చాలా బావుందిలే..’ అంటూ సాగే పాట పెద్ద హిట్ అయ్యింది. సిద్ శ్రీరామ్ పాడిన పాట ఇది. ఈ పాటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి కలగడానికి కారణమైంది. నిజంగానే సినిమాలో ఈ పాట చిత్రీకరణ కూడా బాగుంది.
పాట ఒక్కటే సరిపోదు కదా. సినిమా కూడా బాగుండాలి కదా. ఇంతకీ పెద్దగా పరిచయం లేని నటులెలా చేసినట్లు.? అసలు కథా కమామిషు ఏంటీ.? తెలుసుకుందాం పదండి.
చిన్పప్పటి నుండీ హీరోగారికి కన్‌ఫ్యూజన్ ఎక్కువ. ఎవరైనా ఏదైనా చెబితే నిజమే కదా.. తన దారి ఎప్పటికప్పుడు మార్చేసుకుంటుంటాడు. క్రికెటర్ అవుతానంటాడు. డాక్టర్ అయిపోదామనుకుంటాడు.. నటుడవ్వాలనీ నిర్ణయించేసుకుంటాడు.
ఇంత గందరగోళంలో వుండే మన హీరోగారికి ఓ అమ్మాయి తారసపడుతుంది. ఆ అమ్మాయే తన జీవిత భాగస్వామి అని ఫిక్సయిపోతాడు. ప్రేమలో పడతాడు. మొదట్లో ప్రేమ బాగానే వుంటుంది. చివరికి ప్రేమ బెడిసికొడుతుంది. బ్రేకప్.!
చిలిపి గందరగోళం.!
ఆ తర్వాత షరా మామూలుగానే కన్‌ఫ్యూజన్. ఇప్పుడేం చేయాలి.? అక్కలాంటి ఓ ఫ్రెండ్.. ఏదో సలహా ఇవ్వబోయేంతలో పెళ్లిచేసేసుకోవాలని డిసైడ్ అయిపోతాడు.
పెళ్లి చూపులకెళతాడు. ఎంగేజ్‌మెంట్ పనుల్లో పెళ్లి కూతురి అక్క పట్ల ఆకర్షితుడవుతాడు. ఇంతకీ, మన హీరోగారు ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు.? అది మాత్రం తెర పైనే చూడాలి.
హీరో, హీరోగారి ఇద్దరు ఫ్రెండ్స్ సరదా సరదాగా సినిమాని నడిపించేశారు. హీరోయిన్ కూడా ఓకే అనిపించింది. మిగతా పాత్రధారులంతా జస్ట్ మమ.
కుదిరాయ్.. బాగానే కుదిరాయ్ సుమీ.!
సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా ఓకే. పెద్దగా నస పెట్టేయలేదు. కనుక, మరీ అంత కొత్తదనమూ లేదు కనుక దీన్నొక చిన్న సెలబ్రేషన్ అనుకోవచ్చు.
ధియేటర్లకు వెళ్లి చూడడం కంటే, ఇలాంటి సినిమాలు ఓటీటీల్లో బాగానే వర్కవుట్ అవుతాయ్. జస్ట్ టైమ్ పాస్. పెద్దగా వంకలు పెట్టేయడానికి ఏం లేదు. అలాగని మరీ గొప్పగా చెప్పడానికీ ఏం లేదు.
Also Read: తీరం తాకిన Bheemla Nayak తుపాను: ‘అహంకారం’ కకావికలం.!
మాటలు, ప్రధాన తారాగణం తెర మీద సహజంగా కనిపించడంతో చాలా సరదాగా సినిమా నడిచిన అనుభూతి కలుగుతుంది.
హీరో హర్ష్ కానుమిల్లి (Harsh Kanumilli) ఈ చిత్రానికి రచయిత కూడా. గంగా సాగర్ ద్వారక దర్శకుడు. ప్రశాంత్ విహారి సంగీతం అందించాడు. జిష్ణు రెడ్డి నిర్మాత.