Shaakuntalam Review.. సమంత (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ సినిమాపై మొదటి నుంచీ చాలా అనుమానాలున్నాయి.
‘రుద్రమదేవి’ సినిమాని అల్లు అర్జున్ గట్టెక్కించేస్తే, ఈ ‘శాకుంతలం’ సినిమాని అల్లు అర్జున్ కుమార్తె అర్హ గట్టెక్కించేస్తుందనే స్థాయికి పరిస్థితి దిగజారిపోయింది.!
శకుంతల – దుష్యంతుల ప్రేమకథని దృశ్యకావ్యంగా తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు గుణశేఖర్ ఎంతవరకు సఫలమయ్యాడు.?
కథలోకి వెళితే, ఇది అందరికీ తెలిసిన కథే. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’లోని ప్రేమ కావాన్ని ‘శాకుంతలం’ పేరుతో తెరకెక్కించే ప్రయత్నం గుణశేఖర్ చేశాడు.
Shaakuntalam Review.. ఆ దృశ్యకావ్యం.. ఇప్పుడిలా..
నిజానికి, ఈ ప్రయత్నాన్ని అయితే అభినందించి తీరాలి. కానీ, అంతటి గొప్ప కావ్యాన్ని, ఇంకెంత అందంగా తెరకెక్కించాలి.?
నటీనటుల విషయంలో గుణ శేఖర్‌కి పెద్ద అడ్వాంటేజ్ దొరికింది. కానీ, దాన్ని గుణశేఖర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాసిరకం విజువల్ ఎపెక్ట్స్ సినిమా స్థాయిని తగ్గించేశాయి.
దానికి తోడు, సాగతీతతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు దర్శకుడు సుకుమార్. ఈ మొత్తం వైపల్యానికి గుణశేఖర్ ఒక్కడే బాధ్యత వహించాలేమో.!
సమంత, శకుంతల పాత్రలో చేయగలిగిందంతా చేసింది. దేవ్ మోహన్ కూడా ఓకే. అల్లు అర్హకి ఇదే తొలి సినిమా గనుక, ఆమె నటనకు వంకలు పెట్టడం సబబు కాదు.
కాస్టింగ్ విషయంలోనే ఫెయిల్..
మొత్తంగా చూస్తే స్టార్ కాస్టింగ్ విషయంలోనే ‘ఫెయిల్ అయ్యారా.?’ అన్న భావన థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకలుకు కలుగుతుంది.
తెరపై చాలా పాత్రలు కనిపిస్తాయి. ఆయా పాత్రలు ఇలా వచ్చి, అలా వెళ్ళిపోతాయ్. ఏ పాత్రకీ పెద్దగా ప్రాధాన్యత వుండదు. మోహన్‌బాబు పాత్ర మమ అనిపిస్తుంది.
Also Read: Mrunal Thakur.. అవకాశాల్లేక అంత పని చేసిందా.?
దేవ్ మోహన్ స్థానంలో ఫేమ్ వున్న నటుడ్ని తీసుకుని వుంటే బావుండేది.. సమంత కాకుండా ఇంకెవరైనా అయితే బావుండేది.. ఇలాంటి అభిప్రాయాలు.. థియేటర్లలో ప్రేక్షకులు సినిమా చూస్తుండగానే వ్యక్తం చేయడం కనిపించింది.

ఓవరాల్‌గా చెప్పాలంటే, ఓ అందమైన ప్రేమకథని గుణశేఖర్ చెడగొట్టాడన్న భావన అయితే, ప్రేక్షకుడికి కలిగి తీరుతుంది.
అందుకే, ‘శాకుంతలం’ సినిమా వైపుగా వెళ్ళొద్దు.. అనే అంటున్నారు సినిమా చూసినోళ్ళు.!
ఇంతకీ, ఈ సినిమాని దిల్ రాజు ఎలా టేకోవర్ చేశాడబ్బా.? నిజంగానే టేకోవర్ చేశాడా.? ‘శాకుంతలం’ సినిమా మీద తన స్టాంపేసి, ‘లాయల్టీ’గా కొంత మొత్తం వెనకేసుకున్నాడా.?