Are Syamala YSRCP Sri Reddy.. ఔను కదా.! అప్పట్లో శ్రీరెడ్డి.. ఇప్పుడేమో శ్యామల.! పెద్దగా తేడా ఏం లేదు.! ఇద్దరూ ఒకే బాపతు.!
చిన్న తేడా ఏంటంటే, అధికారికంగా వైసీపీ తరఫున శ్రీరెడ్డికి ఎలాంటి పోస్టూ లేదు.!
కానీ, శ్యామల అలా కాదు, వైసీపీ అధికార ప్రతినిథి. ఏ కోటాలో శ్యామలకి వైసీపీ అధికార ప్రతినిథిగా అవకాశం దక్కినట్లు.? అదో మిస్టరీ.!
బహుశా కులం కోటాలో అయి వుంటుంది.. అంటారు కొందరు.! కాదు, ‘మతం’ కోటాలో అంటారు ఇంకొందరు.! ఎవరి గోల వారిది.!
అన్నట్టు, శ్యామలకి వైసీపీలో అధికార ప్రతినిథి పదవి దక్కడంపై, శ్రీరెడ్డి గుస్సా అయ్యింది. ‘వంకర మొహం’ అంటూ వెటకారం కూడా చేసింది శ్యామల మీద.
Are Syamala YSRCP Sri Reddy.. బూతుల శ్రీరెడ్డికి ఏ గతి పట్టిందో..
వైసీపీ కోసమే, కొత్తగా బూతులు నేర్చుకుని, వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల మీద బూతుల దండకం అందుకుంది అప్పట్లో శ్రీరెడ్డి. చివరికి ఏమయ్యింది.? శ్రీరెడ్డిని వైసీపీ పట్టించుకోలేదు.
శ్యామల పరిస్థితి వేరు.! 2024 ఎన్నికల ప్రచారంలో పిఠాపురం కేంద్రంగా చేసుకుని, వైసీపీ తరఫున కష్టపడింది శ్యామల. అంతేనా, పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని జోస్యం కూడా చెప్పింది.

వైఎస్ జగన్ సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి తాను వెళుతున్నానంటూ, ఫలితాలకు ముందు రోజు సైతం శ్యామల జోస్యం చెప్పింది.. శ్యామల జోస్యాలు తుస్సుమన్నాయ్.
ఇక, తాజాగా శ్యామల, పవన్ కళ్యాణ్ మీద ‘పీపీపీ’ అనే పదాన్ని ప్రయోగించింది. పీపీపీ అంటే, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ అని అర్థమట.!
అన్యమతస్తుల కండకావరం..
ఎంత కండకావరం.? అంతే మరి, హిందూ ధర్మమంటే శ్యామలకి ఎంత వెటకారం.. అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పీఠాధిపతి.. అనే పదాన్ని వెటకారంగా వాడిందంటే, శ్యామల దురహంకారం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.
లేడీ పాస్టర్ శ్యామల.. అంటే బావుంటుందా.? బాగోదు కదా.? పద్ధతి కూడా కాదు.! మరి, పీఠాధిపతి పవన్ కళ్యాణ్.. అని వెటకారం చేయడమేంటి.? దీన్నే బలుపు.. అంటారు.!
Also Read: Good Bad Ugly Review: డిజాస్టర్ ‘సుడిగాడు’.!
ఇలానే నోటికొచ్చింది వాగి, ఎగిరెగిరి పడ్డ శ్రీరెడ్డి పరిస్థితి ఏమైందో, ఓ సారి శ్యామల ఆత్మవిమర్శ చేసుకోవాలి.
కమెడియన్ అలీ, మరో కమెడియన్ పోసాని కృష్ణమురళి.. వీళ్ళ కథల్ని శ్యామల తెలుసుకుంటే మంచిది.
రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ, ఒళ్ళు తెలియకుండా వాగితే, ఫలితం అనుభవించాల్సి వస్తుంది.
అన్నిటికీ మించి, హిందూ ధర్మంపై నోరు పారేసుకుంటే, హిందూ సమాజం సహించే పరిస్థితి అస్సలు లేదు. హిందూ మత విశ్వాసాల జోలికి అన్యమతస్తులు రాకపోవడం ఉత్తమం.