Shalini Pandey Mirror.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బోల్డ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ షాలినీ పాండే. తొలి సినిమాలో అమ్మడి బోల్డ్ పర్‌ఫామెన్స్‌కి యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది షాలినీ పాండే.
క్రేజ్ అయితే వచ్చింది కానీ, ఆ తర్వాత కూడా అలాంటి బోల్డ్ క్యారెక్టర్లే వచ్చాయనీ ఆ సిట్యువేషన్ హ్యాండిల్ చేయడం చాలా కష్టమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది షాలినీ పాండే.
ఆ ఇమేజ్‌ని స్కిప్ చేసుకోవడానికి కొన్ని ఆఫర్లు వదులుకోవల్సి వచ్చిందట కూడా. ఆ తర్వాత ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’ తదితర సినిమాలు షాలినీ పాండేలోని నటిని ఆడియన్స్‌కి పరిచయం చేశాయ్.
Shalini Pandey Mirror.. టాలెంట్ తక్కువేమీ కాదు..
అప్పటితో షాలినీ పాండే ఎలాంటి రోల్ అయినా హ్యాండిల్ చేయగలదన్న అభిప్రాయానికి వచ్చారు ఆడియన్స్. కానీ, ఆ లోపు తెలుగులో అవకాశాలు తక్కువవుతూ వచ్చాయ్ షాలినీ పాండేకి.

‘100 పర్సెంట్ కాదల్’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే ఒకట్రెండు తమిళ సినిమాలనూ చక చకా పూర్తి చేసేసింది.
ఆ తర్వాత డైరెక్ట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. బాలీవుడ్‌లోనే ప్రస్తుతం బిజీగా గడుపుతోందీ అందాల అమ్మడు. బాలీవుడ్‌కెళ్లాకా, సోషల్ మీడియానీ ఎట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది.
బ్లాక్ హాట్ కోబ్రాలా..
అసలే ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో వచ్చిన బోల్డ్ ఇమేజ్ ఎలాగూ వుండనే వుందాయె. దానికి ఇంకాస్త డోస్ పెంచుతూ, గ్లామర్ పిక్స్‌తో నెట్టింట రెచ్చిపోయింది షాలినీ.
Also Read: ప్రియాంక మోహన్.! వద్దు బాబోయ్.!
తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో షాలినీ పాండే చేస్తున్న అందాల రచ్చకి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. అద్దంలో చూసుకుంటూ అందాలను ఎలివేట్ చేస్తోంది షాలినీ పాండే.
ఇంత హాట్ లుక్స్‌లో షాలినీని చూస్తున్న నెటిజనం సో హాట్, సో క్యూట్.. అంటూ పరేషాన్ అయిపోతూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడీ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయిపోతున్నాయ్ మరి.