Bhagyashri Borse Sreeleela.. తెలుగు తెరపైకి ఓ సంచలనంలా దూసుకొచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ‘మిస్టర్ బచ్చన్’ అంచనాల్ని అందుకోలేకపోయినా, భాగ్యశ్రీ పేరు మాత్రం మార్మోగిపోయింది.
‘మిస్టర్ బచ్చన్’ తెలుగులో తొలి సినిమా భాగ్యశ్రీ బోర్సేకి. తొలి సినిమాతో హిట్టు అందుకోలేకపోయినా, సినిమా ప్రమోషన్లతో, తనను తాను బాగానే ప్రమోట్ చేసుకుంది భాగ్యశ్రీ.
అందుకేనేమో, ఎడాపెడా అవకాశాలు వచ్చి పడుతున్నాయి భాగ్యశ్రీ బోర్సేకి. ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలున్నాయ్.. తాజాగా, మరో సినిమా ఆమె చేతిలోకి వచ్చిపడింది.
శ్రీలీల ఔట్, భాగ్యశ్రీ ఇన్..
ఆ మధ్య ఏ హీరోయిన్, ఏ ప్రాజెక్టు నుంచి ఔట్ అయినా, అందులోకి శ్రీలీల దూరిపోయేది.
దూరిపోవడమంటే, శ్రీలీలని అలా వేరే హీరోయిన్లను తీసేయడం ద్వారా ఆ ప్రాజెక్టుల్లోకి తీసుకునేవారు దర్శక నిర్మాతలు.

ఇప్పుడు అదే పరిస్థితి భాగ్యశ్రీ బోర్సే విషయంలోనూ జరుగుతోంది. అఖిల్ – శ్రీలీల కాంబినేషన్‌లో రావాల్సిన సినిమా నుంచి శ్రీలీల ఔట్ అయితే, భాగ్యశ్రీ ‘ఇన్’ అయ్యింది.
Bhagyashri Borse Sreeleela.. ఆ చేదు అనుభవాలు..
వేరే హీరోయిన్లు కమిట్ అయిన సినిమాల్లోకి శ్రీలీల ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఆయా సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. శ్రీలీలకి ఫ్లాపులే మిగిలాయి.
భాగ్యశ్రీ బోర్సే విషయంలో ఏం జరగబోతోంది.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి తెలుగు సినీ పరిశ్రమలో.
నిజంగానే, టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత వుంది. ఈ క్రమంలో భాగ్యశ్రీ బాగానే అవకాశాలు దక్కించుకుంటోంది. ఒక్క హిట్టు.. భాగ్యశ్రీ దశ మారిపోయేలా చేస్తుందన్నది నిర్వివాదాంశం.