Shalini Pandey South Director.. ఫలానా సినిమా టైమ్‌లో ఫలానా డైరెక్టర్ నాతో మిస్ బిహేవ్ చేశాడు.. ఫలానా టెక్నీషియన్ లైంగికంగా వేధించాడు.. అంటూ పలువురు హీరోయిన్లు ఆరోపణలు చేయడం మామూలే.
గతంలో రాధికా ఆప్టే, తాప్సీ పన్ను తదితర ముద్దుగుమ్మలు సౌత్ సినీ ప్రముఖులపై ఈ తరహా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆ లిస్టులోకి మరో ముద్దుగుమ్మ కూడా చేరిపోయింది. ఆమె మరెవరో కాదు, ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ అయిన హీరోయిన్ షాలినీ పాండే.
అప్పుడు లేని తంటా ఇప్పుడెందుకొచ్చిందంటా.!
తొలి సినిమాకే బోల్డ్‌గా నటించేసి కుర్రోళ్ల గుండెల్లో గుబులు పుట్టించేసిందీ జబల్‌పూర్ బ్యూటీ. తర్వాత తెలుగులో ‘మహానటి’, ‘118’ తదితర చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం తెలుగులో పెద్దగా క్రేజ్ లేదీ ముద్దుగుమ్మకి. తమిళ, హిందీ భాషల్లో ఒకటీ అరా సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ని అలా అలా నడిపించేస్తోందనుకోండి.

కెరీర్ డల్ అయిన టైమ్‌లో ఇలా సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసి, ట్రెండింగ్ అయిపోవాలనుకుంటున్నారో ఏమో ముద్దుగుమ్మలు.. తాజాగా షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆ తరహాలోనే వున్నాయ్.
సౌత్‌లో తాను నటించిన తొలి సినిమా టైమ్‌లో జరిగిన ఓ ముచ్చటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్థావించింది.
Shalini Pandey South Director.. ఆ డైరెక్టరు.. అతనేనా.?
క్యారవాన్‌లో ఆమె బట్టలు మార్చుకుంటున్న టైమ్‌లో డోర్ కొట్టకుండా డైరెక్టర్ తన రూమ్‌లోకి వచ్చేశాడట. ఆమె నటించిన తొలి సినిమా అని చెబుతోంది.
తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా అంటే అందరికీ తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’. ఆ సినిమాతోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో విజయ్ దేవరకొండ.. రాత్రికి రాత్రి స్టార్స్ అయిపోయారు.

బ్యాడ్ లక్ ఏంటంటే, డైరెక్టరూ, హీరో స్టార్‌డమ్ సంపాదించారు. కానీ, షాలినీ పాండే మాత్రం అంతంత మాత్రంగానే వుండిపోయింది.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కానీ, ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్థావించలేదు. అలాంటిది.. ఇప్పుడే ఎందుకు ప్రస్థావించాలట.. ఇలాంటి అనుమానాలు తలెత్తుతున్నాయ్.
Also Read: ‘ఆమె’ లేకపోతే ఎలా.? ఔను, అవన్నీ పుకార్లే.!
ప్రస్తుతం షాలినీ పాండేని పెద్దగా పట్టించుకోవడం లేదెవ్వరూ. అటు సందీప్ రెడ్డి మాత్రం స్టార్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు.
ఏదో ఒక రకంగా సెన్సేషనల్ అవ్వాలనే షాలినీ పాండే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిందా.? ఇంతకు ముందూ చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్న షాలినీ.. అప్పుడెప్పుడూ ప్రష్తావించని ఈ విషయం ఇప్పుడే ఎందుకు ప్రస్థావించిందిో.. అందులోని అంతరార్ధం ఏంటో.! ఆమెకే ఎరుక.!