బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌కి సంబంధించి హాటెస్ట్ కంటెస్టెంట్ ఎవరన్న ప్రశ్నకు, షో ప్రారంభం ముందు వరకూ వినిపించిన పేరు షన్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్నూ. యూ ట్యూబ్‌లో షన్నూ వీడియోలకు విపరీతమైన పాపులారిటీ వుంది. యూ ట్యూబ్ రొమాంటిక్ హీరో.. అనేయొచ్చు షన్నూని (Shannu Siri Bigg Drama).
ఏం లాభం.? ఆ జోష్‌లో కనీసం సగం.. పోనీ, పదో వంతు.. కూడా బిగ్ బాస్‌లో షన్నూ చూపించలేకపోతున్నాడు. సిరి, జెస్సీలతో స్నేహం కారణంగానే షన్నూ ఇమేజ్ రోజురోజుకీ పడిపోతోందా.? అంటే, అసలంటూ వాళ్ళిద్దరూ లేకపోతే, షన్నూకి స్క్రీన్ స్పేస్ కూడా దక్కదేమో.. అన్నట్టు తయారైంది పరిస్థితి.
సిరి ఏం పాపం చేసింది షన్నూ.?

తాజాగా కెప్టెన్సీ కోసం జరిగిన ‘గుడ్డు’ టాస్కులో సిరి, జెస్సీల తింగరి గేమ్ ప్లాన్ దెబ్బకి షన్నూ ‘జీరో’ అయిపోయాడు. ఇంతా చేసి, జెస్సీ ఏమన్నా సీక్రెట్ టాస్క్ ద్వారా సక్సెస్ అయ్యాడా.? అంటే అదీ లేదు. అనుకోకుండా అలా జరిగిపోయిందంతే.. ఇందులో సిరి, జెస్సీల తప్పేమీ లేదు.
Also Read: సమంత, నాగచైతన్య మధ్యలో అతనెవ్వడు.?
కానీ, షన్నూ.. ఆ ఇద్దర్నీ తప్పుగా అర్థం చేసుకున్నాడు. సిరి విషయంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నాడు షన్నూ (Shannu Siri Bigg Drama). ఇదంతా బిగ్ బాస్ డైరెక్షన్ అయితే షన్నూని తప్పు పట్టడానికేమీ లేదు. నిజానికి, షన్నూ ప్రవర్తిస్తున్న తీరు చూస్తోంటే, అతన్ని బిగ్ బాస్ డైరెక్షన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది.
లోబో గుడ్డు కహానీ..
ఇదిలా వుంటే, సీక్రెట్ రూమ్‌లోకి వెళ్ళిన లోబో ఎట్టకేలకు కొన్ని రోజుల తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి, హౌస్‌మేట్స్‌ని కలిశాడు. బ్లాక్ ఎగ్ తీసుకెళ్ళి శ్రీరామచంద్ర చేతిలో పెట్టి, శ్రీరామచంద్ర కెప్టెన్ అవకుండా చేశాడు. కెప్టెన్సీ పోటీదారుల లిస్టులోకి కాజల్‌ని తీసుకొచ్చాడు ఆమె చేతిలో బంగారు గుడ్డు పెట్టడం ద్వారా.
సన్నీ పేరు చెబితే కారాలూ మిరియాలూ నూరేస్తూ వచ్చిన ప్రియ, చిత్రంగా.. సన్నీ మీద పులిహోర కలుపుతోంది. ఇక, హౌస్‌మేట్స్ అందర్నీ రింగు మాస్టారులా చక్కబెట్టేస్తున్న యాంకర్ రవి తన పని తాను చేసుకుపోతూనే వున్నాడు.