Table of Contents
Sharmila Against Hindu Temples.. ఐదు వేల దళిత వాడల్లో హిందూ దేవాలయాల్ని నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.!
అసలు దళితులంటే ఎవరు.? దళితులంటే, హిందువులే కదా.! మరి, ఆ దళిత వాడల్లో, హిందూ దేవాలయాల నిర్మాణం.. సబబే కదా.?
కానీ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం, ‘దళిత వాడల్లో హిందూ దేవాలయాలు నిర్మించాల్సిన అవసరమేంటి.?’ అంటూ, అమాయకంగా, ఆగ్రహావేశాలతో ప్రశ్నించేశారు.
Sharmila Against Hindu Temples.. ప్రజా సేవ.. అంటే, ఏంటి షర్మిల.?
వైఎస్ షర్మిల క్రైస్తవురాలు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పలు సందర్భాల్లో స్వయంగా ప్రకటించుకున్నారు కూడా. ఆమె భర్త, క్రైస్తవ మత ప్రచారకుడు.
2019 ఎన్నికల్లో వైసీపీ కోసం షర్మిల, ఆమె భర్త ‘బ్రదర్’ అనిల్ కుమార్.. చేసిన మత ప్రచారం గురించి కొత్తగా చెప్పేదేముంది.?
కానీ, ఎన్నికలయ్యాక, వైఎస్ షర్మిలను వైసీపీ నుంచి గెంటేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దాంతో, అన్న మీద కోపంతో, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు షర్మిల.
Also Read: ‘ఐ ఫోన్’ కోసం బిచ్చగాళ్ళైపోతున్నారెందుకు.?
తెలంగాణలో షర్మిలని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో, గోడక్కొట్టిన బంతిలా, తిరిగి ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు షర్మిల.. ఈసారి కాంగ్రెస్ జెండా పట్టుకున్నారామె.
టీటీడీ, ప్రజా సేవ చెయ్యాలిగానీ.. దేవాలయాలు నిర్మించడమేంటి.? అన్నది షర్మిల వింత ప్రశ్న.
షర్మిల మాటల ప్రకారం.. ‘బ్రదర్’ అనిల్ కుమార్ కూడా ప్రజా సేవ చేయాలిగానీ, మత ప్రచారం చేయడమేంటి నాన్సెన్స్ కాకపోతే.?
టీటీడీ అంటే.. హిందువులది మాత్రమే..
తిరుమల తిరుపతి దేవస్థానం.. అంటే, అది కేవలం హిందువులది మాత్రమే. టీటీడీకి వచ్చే ప్రతి పైసా, హిందువుల నుంచే వస్తోంది.
అలా హిందువుల నుంచి వచ్చే సొమ్ముల్ని, తిరిగి హిందూ మత ప్రచారం కోసమే టీటీడీ వినియోగించాలి. భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలతోనే టీటీడీ ఖజానా నిండుతోంది.
సో, టీటీడీ నిర్మించాల్సింది దేవాలయాల్ని.. అదీ, హిందువుల కోసమే. మధ్యలో క్రైస్తవురాలు అయిన వైఎస్ షర్మిలకి వచ్చిన నొప్పి ఏంటి.?
కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, వైఎస్ షర్మిల.. అన్ని మతాల్నీ సమానంగా గౌరవించాలి. చట్టబద్ధంగా ఏర్పాటైన టీటీడీని గౌరవించాలి. హిందూ దేవాలయాల్ని కూడా గౌరవించి తీరాలి.
క్రైస్తవురాలు షర్మిలకి ఏంటి సంబంధం.?
లేదూ, తాను రాజకీయ నాయకురాలిని కాదనీ.. కేవలం క్రైస్తవురాలిని మాత్రమేనని షర్మిల భావిస్తే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఆ తర్వాత ఇలాంటివి మాట్లాడుకోవచ్చు.
నిజానికి, ఓ క్రైస్తవురాలిగా కూడా, హిందూ దేవాలయాలపై మాట్లాడే నైతిక హక్కు షర్మిలకి లేదు.
చివరిగా ఇంకోస్సారి.. దళితులంటే, హిందూ దళితులు మాత్రమే.! దళిత వాడల్లో హిందూ దేవాలయాల నిర్మాణం.. టీటీడీ మాత్రమే కాదు, హిందువులందరి బాధ్యత.!
