పోయేకాలం: ముసలాడేగానీ.. ‘మగా’నుభావుడు.!
Musalaade Gaanee Magaanubhaavudu.. ప్రజా ప్రతినిథి అంటే ఎలా వుండాలి.? అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా.. ప్రజా ప్రతినిథి అంటే, ప్రజా సేవకుడే.!
కానీ, ఆ ప్రజా సేవకుడు.. కామాంధుడైతే.! ఆరు పదుల వయసులోనూ, అక్రమ సంబంధాలకోసం కక్కుర్తి పడితే.?
కామాతురాణాం.. న భయం.. న లజ్జ.! అని ఊరకనే అన్నారా.? ఇదిగో, ఇలాంటోడ్ని చూసే అలా అని వుంటారు.
Musalaade Gaanee Magaanubhaavudu.. పదవి పెద్దది.. బుద్ధి చాలా చిన్నది.!
గౌరవ పదవిలో వుంటూ, ‘పెద్దల సభకు’ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఓ ‘పెద్ద’మనిషి, ఆరు పదుల వయసులో వున్నా, తన మనవరాలి వయసున్న మహిళపై మనసు పారేసుకున్నాడట.
చట్ట సభల్లో నేర చరితులకు ‘పెద్ద పీట’ దక్కుతున్నన్నాళ్ళూ.. వ్యవస్థలు సరిగ్గా పనిచేయవ్.! నేరానికి శిక్ష సకాలంలో అనేది జరిగే పనే కాదు.! ఎందుకంటే, నేరస్తులే చట్టాలు చేస్తున్నారు కాబట్టి.. అనే ఆవేదన ప్రజల్లో వుంది.
Mudra369
అయినా, ప్రేమకు వయసుతో పనేంటి.. అంటారా.? ఇది ప్రేమ కాదు, పైత్యం, పోయేకాలం.! కామంతో కళ్ళు మూసుకుపోయి, వివాహితపై కన్నేశాడట. ఆపై కడుపు చేశాడట కూడా.
పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ సదరు మహిళ అసలు భర్త, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ‘పండు కోతి’ బండారం బయటపడింది.
సాగతీతతో న్యాయం జరిగేదెలా.?
సరే, ఇలాంటి కేసుల్లో విచారణ ఎలా సాగుతుంది.? ఎన్నేళ్ళు సాగతీతకు గురవుతుంది.? అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కేసు, అరెస్టు, జైలు, బెయిలు.. ఇదో పెద్ద ప్రసహనం. కేసుకీ అరెస్టుకీ మధ్య చాలా జాప్యం వుంటుంది. అరెస్టుకీ, జైలుకీ మధ్య మళ్ళీ బోల్డంత తతంగం.
Also Read: ఎర్నలిస్ట్ కాంతమ్.. ఎన్ని వందల కోట్ల నెత్తుటి కూడు తిన్నావ్.?
ఒక్కోసారి జైలుకీ – బెయిలుకీ మధ్య పెద్దగా గ్యాప్ వుండదు.. సులువుగానే తప్పించేసుకుంటారు. ఇక్కడ, ఈ పైశాచిక పెద్దా‘రెడ్డి’ సంగతేంటట.?
కొత్త చట్టాలతో శిక్ష పడేనా.?
ఈ మధ్యనే దేశంలో ‘ఐపీసీ’ స్థానంలో కొత్త చట్టాలు వచ్చాయట.! మరి, వాటితో అయినా, కామాంధుడికి శిక్ష పడుతుందా.?
చట్టాలు చేసే చట్ట సభలోనే వున్న ఆ ‘పెద్ద’ కామాంధుడికి శిక్ష పడటం చాలా చాలా ముఖ్యమిప్పుడు.
నేరం జరిగినప్పుడు.. నేరస్తుడికి శిక్ష పడకపోతే.. నేరస్తుల్లో భయమెలా పుడుతుంది.?
Mudra369
ఔను, అలాంటోడికి శిక్ష సకాలంలో పడితేనే, న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్నట్టు.! అక్కడిదాకా వెళ్ళాలంటే, ముందు ఆ కామాంధుడి అరెస్టు జరగాలి కదా.?