వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. చెప్పోటోడు ఎన్ని కథలైనా చెబుతాడు అన్నట్టుంది పరిస్థితి. లేకపోతే, తాను చేసే వ్యాపారాల గురించి తన భార్యకి రాజ్ కుంద్రా (Shilpa Shetty Knows Nothing About Raj Kundra) అస్సలేమీ చెప్పకుండా వుంటాడా.? శిల్పా శెట్టి, తన భర్త వెలగబెడ్తున్న రాచ కార్యాల గురించి తెలుసుకోకుండా వుంటుందా.? కానీ, ఇద్దరూ ఒకరికొకరు ఏమీ చెప్పుకోనట్టు భలే నటిస్తున్నారు విచారణ సందర్భంగా.
బూతు వీడియోల చిత్రీకరణ కేసులో రాజ్ కుంద్రా (Raj Kundra) అరెస్ట్ అయిన విషయం విదితమే. 122 వీడియోల్ని చిత్రీకరించేందుకు 9 కోట్ల రూపాయల మేర డీల్ చేసుకున్నాడు రాజ్ కుంద్రా. హాట్ షాట్ అనే యాప్ ద్వారా అసభ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజ్ కుంద్రా, ఆ యాప్ గురించి అస్సలేమాత్రం తన భార్య శిల్పా శెట్టికి చెప్పలేదట. అలాగని శిల్పా శెట్టి, విచారణలో పోలీసులకు తెలిపిందట.
చిత్రమేంటంటే, షమితా శెట్టి.. (Shamita Shetty) అదేనండీ, శిల్పా శెట్టి సోదరి.. రాజ్ కుంద్రా మరదలు.. హాట్ షాట్ యాప్ కోసం కొన్ని వీడియోలు చేయడానికి అంగీకరించింది. షూట్ కూడా చేయడానికి సర్వసన్నద్ధమయ్యారట. ఈ విషయాన్ని రాజ్ కుంద్రా కంటే ముందే బూతు రాకెట్ కేసులో అరెస్టయిన మరో నటి గెహనా వశిష్ట్ స్వయంగా వెల్లడించింది.
అబ్బే, మేం తీస్తున్నవి బూతు వీడియోలు కాదంటూ రాజ్ కుంద్రాని వెనకేసుకొచ్చింది ఈ గెహనా వశిష్ట్ (Gehana Vasisth) అనే నటి కావడం గమనార్హం. రాజ్ కుంద్రా డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఆయన గతంలో వెలగబెట్టిన ఘనకార్యాలు అలాంటివి మరి. బెట్టింగ్ సహా దేన్నీ వదల్లేదు రాజ్ కుంద్రా.
ఇప్పుడేమో, ఇదిగో.. బూతు రాకెట్లో ఇరుక్కుపోయాడు. తనతోపాటు తన భార్య శిల్పా శెట్టినీ (Shilpa Shetty Knows Nothing About Raj Kundra) ఇరికించేశాడు.