రష్మిక మండన్న అంటే నేషనల్ క్రష్ కదా.! ఆమెను చూస్తే కొందరికి (Shraddha Kapoor Ignores Rashmika) జెలసీ వుండొచ్చుగాక.!
అందునా, కొందరు బాలీవుడ్ భామలు, రష్మిక పేరు చెప్పగానే కస్సుమంటుండొచ్చుగాక.! ఇంతకీ, ఎవరు వాళ్ళు.?
ఆ లిస్టులో ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా వుందా.? వుందనే అనుకోవాలేమో.! ఇటీవల బాలీవుడ్ ప్రముఖులు ఓ పార్టీకి అటెండ్ అయ్యారు.
పార్టీ అంటే, పండుగల సందర్భంలో నిర్వహించేది కూడా.! అలాంటి, ఓ ఈవెంట్‌లో రష్మిక మండన్న సందడి చేసింది.
అదే ఈవెంట్‌కి శ్రద్ధా కపూర్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. సౌత్‌లో సినిమాలు చేస్తున్న ముంబై బ్యూటీస్ కూడా ఈ ఈవెంట్‌లో కలర్‌ఫుల్‌గా దర్శనమిచ్చారు.
Shraddha Kapoor Ignores Rashmika.. రష్మిక పాపులారిటీని సహించలేక..?
నిజానికి, రష్మిక ఎక్కడ వుంటే అక్కడ సందడి మామూలే.! ‘మేమ్.. మేమ్..’ అంటూ కెమెరాలు రష్మిక వెంట పడ్డాయ్.
అది చూసి, శ్రద్ధా కపూర్ నొచ్చుకున్నట్టుంది. శ్రద్ధా కపూర్ వస్తోందని గమనించి, ఆమెని పలకరించేందుకు ప్రయత్నించింది రష్మిక.

కానీ, శ్రద్ధా కపూర్ లైట్ తీసుకుంది. దాంతో, రష్మిక ఒకింత ఇబ్బందికరంగా ఫీలవ్వాల్సి వచ్చింది. వెంటనే తేరుకుని, నవ్వుతూ కెమెరాలకు పోజులిచ్చింది రష్మిక.
ఇంతకీ, శ్రద్ధా కపూర్ – రష్మిక మండన్నల మధ్య ఏదన్నా గొడవ నిజంగానే జరిగిందా.? ఏమో.. ఆ ఇద్దరికే తెలియాలి.
రష్మిక అభిమానులు మాత్రం, తమ అభిమాన నటి నేషనల్ క్రష్ రష్మికకి ఘోర అవమానం జరిగిందనీ, శ్రద్ధా కపూర్ అహంకారం ప్రదర్శించిందని గుస్సా అవుతున్నారు.