Table of Contents
Shriya Saran Kabzaa.. శ్రియ విషయంలో వయసు పెరుగుతోందో.. తరుగుతోందో అస్సలు అర్ధం కావడం లేదు. ‘ఇష్టం’ సినిమాతో అప్పుడెప్పుడో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది.
తన క్యూట్ లుక్స్‌తో తెలుగు తంబీలకు చాలా చాలా దగ్గరైపోయింది. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడే, స్పెషల్ సాంగ్స్‌లోనూ నటించి కొత్త ట్రెండ్ సృష్టించింది శ్రియ శరణ్.
స్టార్ హీరోలు.. యంగ్ హీరోలు.. అనే తేడా లేకుండా ఆఖరికి మెగాస్టార్ చిరంజీవితో సైతం స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రియ శరణ్ మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నట్లు కనిపించినా ఆ తర్వాత మళ్లీ బిజీ అయిపోయింది.
అక్కడా ఇక్కడా.. సూపర్ బ్యాలెన్సింగ్.!
తెలుగుతో పాటూ, తమిళ, కన్నడ, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే వుంది శ్రియ శరణ్. ఫేడవుట్ అయిపోయింది.. అనుకున్నప్పుడల్లా రెట్టించిన గ్లామర్‌తో మళ్లీ మళ్లీ తెరపైకొచ్చింది శ్రియ శరణ్.

పెళ్లి, పిల్లలు.. ఇలా వైవాహిక జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూనే కెరీర్‌ని ఎప్పుడూ బిజీగా వుంచుకునేందుకే ప్రయత్నించింది.
Shriya Saran Kabzaa.. బ్యూటీ ఆప్ డెడికేషన్..
నటన కోసం శ్రియ ఎంత డెడికేటెడ్ అనీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ హీరోయిన్‌గా ఆఫర్లు దక్కుతున్నాయంటేనే నటన పట్ల ఆమెకున్న ప్యాషన్, డెడికేషన్ ఏ పాటివో అర్ధం చేసుకోవచ్చు.
సీనియర్ హీరోయిన్ కదా.. గ్లామర్ ఏముంటుందిలే అనుకుంటు తప్పులో కాలేసినట్లే శ్రియ విషయంలో. ఎంత సీనియర్ అయినా, వర్ధమాన భామలకు ఏమాత్రం తీసిపోకుండా ఫిజిక్ మెయింటైన్ చేస్తుంటుంది.
గ్లామర్‌లోనూ అదే ఉత్సాహం.. తాజాగా పింక్ కలర్ డ్రస్‌లో శ్రియ శరణ్‌ని చూస్తుంటే, నేటి హీరోయిన్లు అసూయతో కుళ్లుకోవల్సిందే. అంత అందంగా మెరిసిపోతోంది ఈ పిక్స్‌లో శ్రియ శరణ్.
సోషల్ ‘హాట్’ క్వీన్..
ప్రస్తుతం ‘కబ్జా’ అనే కన్నడ సినిమాలో నటించింది శ్రియ శరణ్. ‘కేజీఎఫ్’ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో ఉపేంద్ర హీరోగా నటించారు. త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది ‘కబ్జా’.

ఈ సినిమాలో శ్రియ చాలా హుందా అయిన పాత్రలో కనిపిస్తోంది. వయసుకు తగిన పాత్రలో చాలా పవర్ ఫుల్ లుక్స్‌లో జేజమ్మగా కనిపిస్తోంది శ్రియ శరణ్.
Also Read: Rakul Preet Singh Newboo.. కొత్త యాపారం గురూ.!
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే శ్రియ శరణ్ తనలోని హాట్ యాంగిల్స్‌కి తెర లేపింది. కుర్ర హృదయాల్ని కొల్లగొట్టే పనిలో బిజీ అయిపోయింది.