నలుగురికీ చెప్పి చేసుకోవాలిగానీ, సీక్రెట్‌గా అంత పెద్ద పనులు ఎలా చేసేస్తారు.? దిస్ ఈజ్ టూ మచ్.. కాదు టెన్ మచ్.! ఔను, శ్రియ (Shriya Saran) చాలా పెద్ద తప్పు చేసేసింది. పైగా, అది సీక్రెట్‌గా చేసేసిన తప్పిదం. అందుకే, అది ఘోర తప్పిదం.. నేరం కూడా.‘
ఇంతకీ, శ్రియ చేసిన తప్పేంటో తెలుసా.? తల్లి అవడం. ఏ స్త్రీకి అయినా, మాతృత్వం ఓ వరం.. అంటారు పెద్దలు. అలాంటప్పుడు, శ్రియ తల్లి అవడమెందుకు తప్పు.? ఎందుకంటే, ఆమె సీక్రెట్‌గా తల్లి అయ్యింది కాబట్టి. ఎంచక్కా ప్రేమించి పెళ్ళి చేసుకుంది ఆండ్రూ కొశ్చీవ్‌ని. అలాంటప్పుడు, ఇదెలా తప్పవుతుంది.?
Also Read: సుధీర్ – రష్మిల పెళ్లి గోల.. ఇంకెన్నాళ్ళిలా.?
హీరోయిన్ల చుట్టూ వచ్చే గాసిప్పులు, స్పైసీ కథనాలు ఇలాగే వుంటాయ్ మరి. ఎప్పటికప్పుడు భర్తతో కలిసున్న ఫొటోల్ని శ్రియ షేర్ చేస్తోందిగానీ, బేబీ బంప్ వున్న ఫొటోల్ని (గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ దాకా.. బేబీ బంప్ ఫొటోల్ని షేర్ చేయడం ట్రెండింగ్ కదా ఇప్పుడు) బయటపెట్టకపోవడం శ్రియ చేసిన నేరంగా కొందరు పరిగణిస్తున్నారు.
సమంత – నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలుసా.? దీని వెనుక, ‘అబార్షన్’ కీలక పాత్ర పోషించిందంటూ గాసిప్స్ రావడం, వాటిపై సమంత ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిన సంగతే. కాజల్ త్వరలో తల్లి కాబోతోందట.. అందుకే సినిమాలు మానేసిందట.. అంటూ గాసిప్స్ వినిపిస్తుడడమూ వెర్రితనమే.
Also Read: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ‘తెర’ యెనక బాగోతం.!
సెలబ్రిటీలయినప్పటికీ, వాళ్ళూ మనుషులే కదా.. వాళ్ళకీ వ్యక్తిగత జీవితాలుంటాయ్. శ్రియ – ఆండ్రూ దంపతులకు అమ్మాయి పుట్టిందట.. అన్న వార్తకీ, ‘సీక్రెట్’గా శ్రియ తల్లయిపోయిందట.. అన్న ప్రచారానికీ ఎంత తేడా.? కాస్తంత స్పైసీ టచ్.. ఏ వార్తకైనా వుంటే ఆ కిక్కే వేరప్పా.!
అన్నట్టు, కరోనా పాండమిక్ (Covid 19 Pandemic)నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలోనే శ్రియ – ఆండ్రూ (Shriya Saran Andrei Koscheev) దంపతులు తల్లిదండ్రులయ్యారట.