Shruthi Narayanan Leaks.. ఓ సినీ నటి లీక్ వీడియో బయటకు వచ్చిందట.! ‘డీఎం చెయ్ మోవా’ అంటూ, ట్వీట్లు పోటెత్తేస్తాయ్. ఓ వారం పది రోజులపాటు సోషల్ మీడియాలో అదే రచ్చ.
డీప్ ఫేక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక, ఏది రియల్.. ఏది ఫేక్.. అనేది తేల్చడం కష్టమైపోయింది. ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. సింపుల్‌గా మొబైల్ ఫోన్లలో మార్ఫింగ్ చేసెయ్యొచ్చు.
సో, కుప్పలు తెప్పలుగా మార్ఫింగ్ వీడియోలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయన్నమాట. వాటిల్లో అన్నీ, ట్రెడింగ్‌లోకి రావు. కొన్ని మాత్రం అనూహ్యంగా ట్రెండింగ్ అవుతుంటాయ్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా, గ్యాలరీల్లో ఓ అమ్మాయి క్యూట్ అప్పీల్.. ఎలాగైతే, వైరల్ అయిపోతుందో.. ఇదీ అంతే.!
Shruthi Narayanan Leaks.. ట్రెండింగ్.. పాపులారిటీ.. మట్టీ, మశానం.!
మహా కుంభ మేళా సందర్భంగా, ఓ అమ్మాయిని రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో సెన్సేషన్ చేసేశారో, అలాగే మార్ఫింగ్ వీడియోల్ని కూడా ట్రెడింగ్ చేసి పారేస్తున్నారు.
తాజాగా, మరో నటి.. ఈ మార్ఫింగ్ బారిన పడింది. పది నిమిషాలకు పైనే నిడివి వున్న ఓ వీడియో ఆమెదిగా చెలామణీ అవుతోంది. అత్యంత అసభ్యకరంగా వుంది ఆ వీడియో.
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా.. అని, అందరి చేతుల్లోకీ.. ‘పో..’ వీడియోలు తేలిగ్గా వచ్చేస్తున్నాయ్. చూడాలా.? వద్దా.? అన్నది ఆయా వ్యక్తుల విజ్ఞతని బట్టి ఆధారపడి వుంటుంది.
సోషల్ ఛండాలం..
ఇక, సోషల్ మీడియాలో అయితే.. చూస్తున్నాం కదా, దిక్కుమాలిన ట్రెండింగ్ పుణ్యమా అని.. నానా ఛండాలాన్నీ చూడాల్సి వస్తోంది.
‘మీ కోసం’ అంటూ, కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ట్రెండింగ్ కంటెంట్‌ని వద్దన్నా మన ముందుంచుతున్నాయి.
Also Read: అదిదా సర్‌ప్రైసు: కేతికని కత్తిరించేశారహో.!
‘అందులో వున్నది నేను కాదు మొర్రో..’ అంటూ ఆయా సెలబ్రిటీలు వాపోతున్నా, ఈ తరహా కంటెంట్ సోషల్ మీడియా నుంచి డిలీట్ అవడంలేదు.
సైబర్ క్రైమ్ విభాగం ఏం చేస్తోంది.? అని మాత్రం అడక్కూడదు.! అదంతే.! గతంలో రష్మిక మండన్న, చాలాకాలం క్రితం త్రిష కృష్ణన్.. మధ్యలో చాలామంది.. తాజాగా, శృతి నారాయణన్.. ఈ ‘లీక్’ బాధితులు.!
ఔను, ఆమె కూడా మన తల్లి లాంటిదే, చెల్లి లాంటిదే.! మన ఇంట్లోని మహిళ లాంటిదే.!
మన ఇంట్లో మనమే సీక్రెట్ కెమెరాలు పెట్టుకుని, వీడియోలు తీసుకుని చూసుకుంటే ఎలా వుంటుంది.? ఇతరులకు షేర్ చేస్తే ఎలా వుంటుంది.? అత్యంత జుగుప్సాకరంగా వుంటుంది కదా.!
కొంచెం మనుషుల్లా ఆలోచించండి.!