అయ్యయ్యో.! శృతి హాసన్ Shruti Haasan కేవలం గ్లామర్ డాల్‌గానే మిగిలిపోయిందా.?
‘వాల్తేరు వీరయ్య’, (Waltair Veerayya) ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy).. ఈ రెండు సినిమాల్లోనూ శృతి హాసన్ హీరోయిన్‌గా నటించినా, ఆమెనెవరే పట్టించుకోవట్లేదేంటబ్బా.?
తొలుత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహా రెడ్డి’ విడుదలైంది. ఆ వెంటనే ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘వాల్తేరు వీరయ్య’.
శృతి హాసన్ అభిమానులు.. ఇంకోపక్క బాలయ్యని వ్యతిరేకించేటోళ్ళు.. చిరంజీవి అంటే గిట్టనివాళ్ళూ.. శృతి హాసన్‌కి అన్యాయం జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు.
Mudra369
చిరంజీవి, బాలకృష్ణ.. ఈ ఇద్దరిలో సంక్రాంతి హీరో ఎవరు.? అన్న చర్చ తప్ప, సంక్రాంతి హీరోయిన్ గురించి డిస్కషన్ లేకుండా పోయింది.
Shruti Haasan.. దెబ్బ కొట్టిన అనారోగ్యం..
‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి శృతి హాసన్ హాజరైంది. కానీ, ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డుమ్మా కొట్టేసింది శృతి హాసన్.. అనారోగ్యం కారణంగా.
‘ఏమో, ఎవరు భయపెట్టారో..’ అంటూ చిరంజీవి (Mega Star Chiranjeevi), శృతి హాసన్ మీద సెటైర్ వేశారు కూడా. ఆ సంగతి పక్కన పెడితే, రివ్యూల్లో ఎక్కడా శృతి హాసన్ గురించి స్పెషల్ మెన్షన్ లేదు.
Also Read: మాస్క్ మాటున ‘మాయ లేడీ’ మనోభావాలు.!
వాస్తవానికి ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) సినిమాలో శృతి హాసన్ గ్లామర్ గురించి కాస్త మాట్లాడుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాలో ఆమె గురించి అస్సలు డిస్కషన్ లేకుండా పోయిందాయె.
ఏమో.. ముందు ముందు వస్తుందేమో..
ఇప్పటికైతే శృతి హాసన్ పేరు ఎక్కడా వినిపించట్లేదు. ముందు ముందు వినిపిస్తుందేమో.! ఇదొక చిత్రమైన పరిస్థితి శృతి హాసన్‌కి.

శృతి హాసన్ అభిమానులు.. ఇంకోపక్క బాలయ్యని వ్యతిరేకించేటోళ్ళు.. చిరంజీవి (Mega Star Chiranjeevi) అంటే గిట్టనివాళ్ళూ.. శృతి హాసన్‌కి అన్యాయం జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఈ రచ్చ సంగతి సరే.. ఇంతకీ శృతి హాసన్ ఎక్కడ.?