Shruti Haasan Health Problem.. మనిషి శరీరమే రోగాల పుట్ట.. అంటాడో మహా కవి. అది నిజం కూడా.
నోటిలో బోల్డంత బ్యాక్టీరియా వుంటుంది. జీర్ణాశయంలో బ్యాక్టీరియా లేనిదే పని జరగదు. చెప్పుకుంటూ పోతే, అదో పెద్ద కథ.!
తలనొప్పి తెలియనోడెవడైనా వుంటాడా.? జీవితంలో జలుబుని ఎదుర్కోకుండా వుండగలమా.? చిన్న చిన్న శారీరక ఇబ్బందుల నుంచి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వరకూ.. ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఖచ్చితంగా వుంటుంది.
సెలబ్రిటీలు పాపులారిటీ పెంచుకోవడానికి కొత్త కొత్త పేర్లతో కొన్ని అనారోగ్య సమస్యల గురించి చెబుతుంటారు. కొందరు నిజంగానే అలాంటి సమస్యలతో బాధపడుతుండొచ్చుగాక.
Shruti Haasan Health Problem.. అసలు రోగమేంటి.? జరుగుతున్న ప్రచారమేంటి.?
వాటిని మీడియా ప్రచారం చేసే తీరు మరీ వింతగా కనిపిస్తుంటుంది. సెలబ్రిటీల మీద వార్తలకి జనంలో వుండే క్రేజ్ అలాంటిది మరి. ఈ క్రమంలో ఇదిగో పులి.. అనగానే, అదిగో తోక.. అన్నట్టు తయారవుతుంది వ్యవహారం.
సినీ నటి శృతి హాసన్ ఓ అనారోగ్య సమస్య గురించి కొన్నాళ్ళ క్రితం పేర్కొంది. అంతే, ‘తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శృతి హాసన్..’ అంటూ మీడియాలో కథనాలు వండి వడ్డించేయబడ్డాయ్.!

చివరికి, తూచ్.. అదేం లేదు.. నేను బాగానే వున్నానంటూ శృతి హాసన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
లేకపోతే, ‘ఔనా, శృతి హాసన్ ఇక ఎక్కువ కాలం బతకదేమో.. ఆమెకు సినిమాల్లో అవకాశాలిస్తే, ఆ సినిమాలేమౌతాయో.?’ అని నిర్మాతలు భయపడేవారేమో.! ఇలా తయారైంది పరిస్థితి.
పబ్లిసిటీ కావాలి గురూ.!
కారణం ఏదైతేనేం.. ఆమె ఏం చెప్పినాగానీ, రావాల్సినదానికంటే ఎక్కువ పబ్లిసిటీనే, అదీ చాలా ఉచితంగా లభించేసింది.
అన్నట్టు, ఈ రోజుల్లో సెలబ్రిటీలకు మానసిక సమస్యలు చాలా చాలా ఎక్కువైపోయాయ్. వాటికి ఏవేవో పేర్లు పెడుతూ, వాటితోనూ చాలామంది పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు.
Also Read: నభా నటేష్ ‘డేటింగ్’ పైత్యం.! ఛీ పాడు యాపారం.!
కాదేదీ పబ్లిసిటీకి అనర్హం. ఇది మహా రోగం అనాలా.? రోగం పేరుతో మహా ప్రచారం అనాలా.? రెండోదే రైటు.!
క్యాన్సర్ బారిన పడ్డ మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్‌దాస్.. ఆ మహమ్మారి నుంచి బయటపడ్డారు.
కానీ, వాళ్ళంతా క్యాన్సర్‌తో ఓ వైపు పోరాటం చేస్తూనే, ఇంకో వైపు.. తమ మీద మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంతోనూ పోరాడాల్సి వచ్చింది. కొందరి కథ ఇలా వుంటుంది.
ఇంకొందరి కథ, ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా.. కాదేదీ ప్రచారానికి అనర్హం అని.! అలా వుంటుంది.