Home » పెద్దాయనా.! అట్టా ఎట్టా సచ్చిపోయినవ్.!

పెద్దాయనా.! అట్టా ఎట్టా సచ్చిపోయినవ్.!

by hellomudra
0 comments
Mystery Not Just A Story

Mystery Not Just A Story..ఏదన్నా చిన్న దొంగతనం జరిగితే, అనుమానితుల్ని తీసుకొచ్చి బొక్కలో యేసి, కాళ్లూ చేతులూ ఇరక్కొట్టి మరీ నిజాలు కక్కించే పోలీసోళ్లు.. ఓ హత్య కేసులో చేష్టలుడిగి వ్యవహరించారంటే దానర్థమేంటి.?

‘ఏరా చింటూ.! అన్నయ్యను కొట్టావా.? ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూడు..’ అని తండ్రి కోపగిస్తాడు.

అయితే, కొంచెం కూడా తడుముకోకుండా ‘నేనేం చేయలేదు డాడీ.. అన్నయ్యకి ఆ దెబ్బెలా తగిలిందో తెలీదు..’ అంటూ అమాయకంగా చింటూగాడు సమాధానమిచ్చేస్తాడు.

దాంతో, వచ్చిన కోపం వచ్చినంతనే చల్లారిపోతుంది. పెద్దోడి గాయానికి మందు రాసి చిన్నోన్ని మందలించి పెద్దోడికీ కొన్ని జాగ్రత్తలూ చెబుతాడు ఓ బాధ్యత గల తండ్రి.

Mystery Not Just A Story.. గుండెపోటు వస్తే.. గొడ్డలితో నరుక్కున్నాడట.!

కానీ, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న కథ, ఓ విషాదం. ఓ దారుణం. అత్యంత కిరాతకం.. పైశాచికత్వంతో కూడినది. ఇంతకన్నా దారుణం ఇంకేమీ వుండదు. గిదంతా కల్పితమే. కథలోని పాత్రల్ని ఎవరితోనూ పోల్చుకోకూడదని మనవి.

ఓ పెద్దాయన తన ఇంట్లో నిర్జీవంగా పడి వున్నాడు. ఒంటి నిండా గొడ్డలితో ఎవరో నరికిన గాయాలున్నాయ్. ఎటు చూసినా రక్తం. అయితే, గుండెపోటు వచ్చి రక్తం కక్కుకుని సచ్చిపోయాడన్నారు.

ఇంట్లో రక్తం కనిపించింది కాబట్టి, రక్తపు వాంతులయ్యాయనీ, గుండెపోటు వచ్చి గిలగిలా కొట్టుకున్నాడు కాబట్టి, బాత్రూమ్‌లోని కమోడ్‌ని కొట్టుకోవడంతో గాయాలయ్యాయనీ.. సో, ఇది సహజ మరణమేననీ తేల్చిండ్రు మేథావులు.

తినేది అన్నమా.? అశుద్ధమా.?

కడుపుకి అశుద్ధం కాకుండా అన్నం తినేవాడికెవడికైనా అది అత్యంత కిరాతకమైన హత్య అన్న సంగతి తెలుస్తుంది. కానీ, మసి పూసి మారేడు కాయని చేసినట్లు దారుణ హత్యని కాస్తా గుండెపోటుగా చూపించి జనాల్ని వెర్రివెంగళప్పల్ని చేశారు.

వెర్రి జనాలకి వాస్తవం అర్ధమయ్యిందో లేదో కానీ, కట్టుకథల్ని మాత్రం సక్కగా నమ్మేశారు. పోలీసులేం చేస్తున్నారు.? ఇంకేం చేస్తారు.? రాజకీయ నాయకులు ఎలా ఊపమంటే అలా తలకాయలూపారు.

ఏదన్నా చిన్న దొంగతనం జరిగితే, అనుమానితుల్ని తీసుకొచ్చి బొక్కలో యేసి, కాళ్లూ చేతులూ ఇరక్కొట్టి మరీ నిజాలు కక్కించే పోలీసోళ్లు చేష్టలుడిగి చవటల్లా వ్యవహరించారంటే, వాళ్లని పెంపుడు ‘డాషుల్లా’ మార్చేసిన రాజకీయం తాలూకు పవర్ అలాంటిది.. అని జనం చర్చించుకునే పరిస్థితి ఎందుకు వచ్చినట్టు.?

Mystery Not Just A Story.. ఖాకీలేం చేస్తున్నాయ్ సెప్మా.?

ఈ దేశంలో చట్టాలున్నాయ్. కానీ, ఏ చట్టం ఈ దారుణ హత్యలో దోషుల్ని శిక్షించలేకపోయింది. ఆగండాగండి.. మీకు మరీ తొందరెక్కువైపోయింది. శిక్షల దాకా వెళ్లిపోయారు. అసలంటూ, నిందితులెవరో, దోషులెవరో తేలడానికే ఏళ్లు పట్టేస్తోంది.

ఈలోగా ఆ పెద్దాయన ఫోటోలు, రాజకీయంగా కొన్నిరాబందులకు ఉపయోగపడుతున్నాయ్. శవ రాజకీయం అనేది చాలా చిన్న మాట ఈ కథ విషయంలో.

ఓ పెద్దాయనా.! ఇంతకీ నిన్నెవరు చంపారో .. నీకైనా తెలుసా.? అసలు నిన్నెవరైనా చంపారా.? నువ్వే కామెడీగా గొడ్డలి తెచ్చుకుని ముందూ యెనకా నరికేసుకుని తర్వాత తీరిగ్గా కూర్చుని ‘నన్ను చంపారోచ్.!’ అని లేఖ రాసి పోయావా.?

Also Read: మూడో ప్రపంచ యుద్ధం.! మానవ జాతి వినాశనం.!

లేదంటే, ‘నేను సచ్చిపోయింది గొడ్డలి పోటుతో కాదు, గుండెపోటుతో..’ అని జనాలందరికీ ఆత్మ రూపంలో వచ్చి చెప్పావా.? ఏదో ఒకటి ఆ నల్లకోటు పెద్దాయన దగ్గరికెళ్లి ‘అయ్యగారూ.! ఇదీ సంగతి..’ అని సెప్పేస్తే కేసయినా మూసేసుకుంటారు. లేదంటే ఇంకెవడినైనా బొక్కలోనైనా యేసుకుంటారు. ఈ ఒక్క మంచి పనీ సేయడానికైనా ఏ సిలకలోనో, పావురంలోనో దూరి రావయ్యా పెద్దాయనా.!

చివరగా.. ఇది ఓ కథ మాత్రమే సుమండీ.! ఈ కథలోని ఏ పాత్రనీ నిజ జీవితంలో ఏ వ్యక్తులతోనూ పోల్చవద్దని మనవి.!

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group