Shruti Haasan Marriage: విన్నారా.? శృతి హాసన్ పెళ్ళయిపోయిందట. అయితే అవనివ్వండి.! మనకేంటి.? అన్నట్టు, ఇక్కడ ఓ ‘కానీ’ వుంది. అదే అసలు సమస్య. శృతి హాసన్ పెళ్ళయిపోయిందని చెప్పిందెవరో కాదు, ఆమెతో గత కొంతకాలంగా గాఢమైన ప్రేమలో వున్న శాంతను హజారికా.
తనకూ శృతి హాసన్‌కీ (Shruti Haasan) పెళ్ళయిపోయిందని శాంతను ప్రకటించేశాక అంతా విస్తుపోయారు. పెళ్ళి జరిగితే, దానికి తగిన ఆధారాలుండాలి కదా.? ఎవర్నీ పిలవకుండా రహస్యంగా పెళ్ళి చేసేసుకున్నారా.? అంటూ బోల్డన్ని ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
శాంతను హజారికా పేల్చిన బాంబు.!
అయితే, అసలు విషయం వేరేలా వుంది. గత కొంతకాలంగా శృతి హాసన్, శాంతను హజారికా(Santanu Hazarika) మద్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. శాంతను కంటే ముందు శృతి హాసన్, హైఖేల్ కోర్సలేతో ప్రేమలో వుండేది. అది కూడా చాలా కాలం నడిచిన ప్రేమ వ్యవహారం.

శృతి తండ్రి కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అప్పట్లో తన కుమార్తె పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పెళ్ళి చేసుకోకపోయినా, దంపతుల్లానే శృతి, మైఖేల్.. కమల్ బంధువుల ఇళ్ళల్లో జరిగిన పలు శుభ కార్యాలకు మాజరయ్యారు కూడా. ఏమయ్యిందోగానీ, మైఖేల్ – శృతి విడిపోయారు.
Shruti Haasan Marriage ఇంతకీ ఈసారైనా శృతి పెళ్ళి పీటలెక్కుతుందా.?
ఆ తర్వాతే శాంతను – శృతిల మధ్య కొత్తగా ప్రేమ చిగురించింది. అదిప్పుడు.. పెళ్ళి పీటల వైపుగా ఆ ఇద్దరూ నడిచేలా చేస్తోంది.
ఇంకా నడుస్తుండడమేంటి, ఆల్రెడీ పెళ్ళి చేసేసుకున్నామని శాంతను ప్రకటించేశాడు. మనసుల మధ్య పెళ్ళి జరిగిపోయిందట.. భౌతికంగా జరగాల్సిన పెళ్ళి ఒక్కటే మిగిలి వుందన్నది శాంతను ఉవాచ.
Also Read: సన్నీపాపకి కాసుల పంట.. వాళ్లకేమో నష్టాల మంట.!
దేవుడా.! ఇదేం లాజిక్కు.? పెళ్ళిలోనూ మానసిక, బౌతిక.. అనేవి వుంటాయా.? ఏమో వుండే వుంటాయ్.. ఇది నయా ట్రెండ్ మరి.! ఇంతకీ ఈసారైనా శృతి హాసన్ భౌతికంగా పెళ్ళి పీటలెక్కుతుందా.? ఏమో, వేచి చూడాల్సిందే.