Table of Contents
AI Heroine Cinema.. కొత్త ఒక వింత.! పాత, ఒక రోత.! ఔను, అదీ నిజమే.! ట్రెండ్ మారింది.! ఆ ట్రెండ్ మంచిదా.? చెడ్డదా.? అన్న విషయాన్ని పక్కన పెట్టి, ట్రెండ్‌ని ఫాలో అయిపోవడమే.!
సినిమా అంటేనే గ్లామర్.! సో, సినిమాకి గ్లామర్ అవసరం.! గ్లామర్ కోసమే, హీరోయిన్.! ఇది కమర్షియల్ సినిమా ఈక్వేషన్.
అసలంటూ, గ్లామరస్ కమర్షియల్ సినిమాకి హీరోయిన్ అవసరమే లేకపోతేనో.! కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు.. ఔను, అందాల భామతో అస్సలు పని లేదు.!
AI Heroine Cinema.. మారింది.. మారుతోంది గ్లామరస్ ప్రపంచం..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి వింటూనే వున్నాం కదా.! వినడమేంటి, చూస్తున్నాం.. అనుభవిస్తున్నాం కూడా.! ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా, క్షణాల్లో సవివరంగా తెలుసుకుంటున్నాం.
ఈ క్రమంలోనే AI ఫొటోలు, వీడియోలు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి కోకొల్లలుగా. వాటిల్లో మళ్ళీ హీరోయిన్ల ఫొటోలు, వీడియోలకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
మొన్నీమధ్యనే కన్నడలో AI సాంకేతికతో సినిమా తీశారు. నటీనటులెవరూ లేకుండానే తీసిన AI బొమ్మల వీడియో అది.
యూ ట్యూబ్ ఛానళ్ళ పండగ..
యూ ట్యూబ్ ఛానళ్ళు కూడా, AI అందాల భామలతో వీడియోలు ప్రచారంలోకి తెస్తున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంటున్నాయి.
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఎక్కడ చూసినా, AI భామల సందడే.! ముందు ముందు, సినిమాల్లోనూ, ఈ AI భామల తాకిడి పెరగొచ్చు.
అసలంటే, హీరోయిన్లతో పనే వుండకపోవచ్చు రానున్న రోజుల్లో.! ఎందుకంటే, హీరోయిన్ల కంటే అందంగా వుంటున్నాయి ఈ AI అందాల భామల వీడియోలు.
AI మరబొమ్మలు..
న్యూస్ రీడర్లు, సినిమా హీరోయిన్లు.. ముందు ముందు ఏమైపోతారు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. అందుకే మొదట చెప్పుకున్నాం.. కొత్త ఒక వింత.. పాత ఒక రోత అని.
Also Read: విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాల్సిందేనా.?
మర బొమ్మల గురించి విని, ఆశ్చర్యపోయాం.! ఇప్పుడేమో ఆ మర బొమ్మలకీ AI టెక్నాలజీని అద్దుతున్నాం. అవీ వచ్చేస్తే, భౌతికావసరాలకీ రోబోల రూపంలో అందాల భామలు అక్కరకొచ్చేస్తాయ్.
అదే జరిగితే, అసలంటూ మనుషులకి మనుషులతోనే పని వుండకపోవచ్చేమో.! ఆ ముచ్చట గురించి ఇంకోసారి ఇక్కడే చర్చించుకుందాం.!