Siddharth Actor.. ప్రేమ కోసం ఖర్చు చేయొద్దు.. ద్వేషం కోసమూ ఖర్చు చేయొద్దంటున్నాడు నటుడు సిద్దార్ధ్. సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన ఈ నటుడు, సెలబ్రిటీల ‘సోషల్ పైత్యం’పై తనదైన స్టయిల్లో అందులో పంచ్ డైలాగులు పేల్చాడు.
అసలు సెలబ్రిటీలకు లక్షల్లో ఫాలోవర్స్ ఎలా వచ్చిపడుతున్నారు.? అన్న ప్రశ్న ప్రశ్న తరచూ వినిపిస్తుంటుంది. ‘అదంతా ఫేక్ ఫాలోయింగ్’ అనే సమాధానం ఇస్తూ చాలా సర్వేలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తూనే వున్నాయి.
Siddharth Actor తప్పెవరిది.? శిక్ష ఎవరికి.?
డబ్బులు ఖర్చు చేసి మరీ కొందరు సెలబ్రిటీలు ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంటారు. ఇలాంటి ఫ్యాన్ గ్రూప్స్ సోషల్ మీడియాలో వెదజల్లే ప్రేమ, ద్వేషం.. అంతా ఇంతా కాదు. అదంతా పెయిడ్ ప్రేమ, పెయిడ్ ద్వేషం. ప్రేమకి పొంగిపోతారు, ద్వేషానికి రగిలిపోతారు.. సెలబ్రిటీలకు ఇది నిజంగానే పెద్ద సమస్య.

ఎవర్ని ఉద్దేశించి సిద్దార్ధ ట్వీటేశాడోగానీ, కోట్లాది రూపాయల్ని వెదజల్లి సోషల్ మీడియాని విద్వేషాలకు కేంద్ర బిందువుగా మార్చుతున్నారని అంటున్నాడు సిద్దార్ధ.
తమ వేలితోనే, తమ కంట్లోనే పొడిచేసుకుంటున్నారు..
తమ మీద అమితమైన ప్రేమను చూపించుకోవడానికీ, ఇతరుల మీద ద్వేషం వెదజల్లడానికీ ఆ ఫ్యాన్ గ్రూపుల్ని వాడుతున్నారనీ, ఒక్కోసారి అవి రివర్స్ ఎటాక్ చేస్తున్నాయనీ సిద్దార్ధ తన ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం.
Also Read: అందాల రాక్షసి Taapsee Pannu.. అంతలా ఏమార్చేసి.!
సిద్దార్ధ చెప్పింది నూటికి నూరుపాళ్ళూ వాస్తవం. తమ సినిమాల ప్రమోషనల్ వీడియోస్‌కి మైలేజ్ తెచ్చుకోవడమో, లేదంటే తమకు బోల్డంతమంది అభిమానగణం వుందని చాటుకోవడానికో.. ఖర్చు చేసి మరీ పెయిడ్ అభిమానుల్ని తెచ్చుకుంటున్న సినీ తారలకి, ఆ అభిమానుల నుంచే ముప్పు ఎదురవుతోంది.
కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? కష్టం.. కాదు కాదు, అసాధ్యం.!